పెదరాయుడు సినిమాని రీమేక్ చేద్దామనుకొన్నాడు విష్ణు. కానీ.. సన్నాఫ్ పెదరాయుడు అంటూ మనోజ్ ఓ సినిమా మొదలెట్టేశాడు. దాంతో ఆ పెదరాయుడు ఆలోచన పక్కకు వెళ్లిపోయింది. అసెంబ్లీ రౌడీ సినిమాని మళ్లీ తీయాలని ప్లాన్ చేసుకొన్నాడు. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తారని కూడా చెప్పుకొన్నారు.
పూరి – విష్ణు కాంబినేషన్‌లో ఓ సినిమా ఉందనేది నిజమే.. అయితే ఆ సినిమా అసెంబ్లీ రౌడీ కాదట. ఈ స్థానంలో మరో కథను పూరి సిద్ధం చేశాడట. “అసెంబ్లీ రౌడీ కథ… ఇరవై ఏళ్ల క్రితం కొత్త కథే. ఇప్పుడు అలాంటి కథలు చూడ్డానికి జనం సిద్ధంగా లేరు. కాబట్టి.. రిస్క్ తీసుకోవద్దు“ అని పూరి హితవు చెప్పాడట.
పూరి దర్శకత్వంలో నటిస్తే చాలు… అనుకొన్న విష్ణు.. పూరి చెప్పినట్టే తలాడించేశాడు. దాంతో అసెంబ్లీ రౌడీ రీమేక్ కూడా ఆగిపోయింది. పాపం… విష్ణు కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి.