సినిమా తీయడం ఒకెత్తు. దానికి వినూత్నంగా ప్రచారం కల్పించడం మరో ఎత్తు. రెండో యాంగిల్ మిస్ అయితే, సినిమా ఎంత బాగున్నా ప్రయోజనం సున్నా. ఈ విషయంలో రామ్ ఇప్పటికే కొన్ని తప్పులు చేశాడు. ప్రచారాన్ని లైట్ తీసుకొని కోరి ఫ్లాపులు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరోసారి అదే మిస్టేక్ రిపీట్ చేస్తున్నాడేమో అనిపిస్తోంది.
రామ్ లేటెస్ట్ మూవీ ఉన్నది ఒక్కటే జిందగీ. ఈ వీకెండ్ విడుదలకు సిద్ధమైంది ఈ సినిమా. అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి బజ్ లేదు. సాధారణంగానే రామ్ సినిమాలపై క్రేజ్ లో-ప్రొఫైల్ లో ఉంటుంది. దానికి తోడు పబ్లిసిటీ కూడా తగ్గించేస్తే ఇక ఆ సినిమా గురించి మాట్లాడుకునే అవకాశమే ఉండదు.
క్యాచీ టైటిల్ లేకపోవడంతో ఇప్పటికే సినిమాకు సగం బజ్ తగ్గిపోయింది. రామ్ అదేదో సినిమా చేస్తున్నాడని అంటున్నారే తప్పే.. “ఉన్నది ఒక్కటే జిందగీ” అనే పదం వెంటనే గుర్తుకురావడం లేదు చాలామందికి. ఇలాంటి టైమ్ లో సినిమాకు ఎక్స్ ట్రా ప్రమోషన్ ఇవ్వాల్సింది పోయి యూనిట్ అంతా సైలెంట్ అయిపోయింది. దీపావళికి ఓ ఇంటర్వ్యూ ఇచ్చి చేతులు దులిపేశారు. ప్రమోషన్ లో కొత్తదనమే లేదు.
మాస్ మసాలా సినిమాలైతే పర్వాలేదు. ఇలాంటి ఎమోషనల్ కంటెంట్ తో మూవీ చేసినప్పడు కచ్చితంగా ఆడియన్స్ ను విడుదలకు ముందే మానసికంగా సన్నద్ధం చేయాలి. సినిమా యూనిట్ ఆ పని ఎప్పుడు స్టార్ట్ చేస్తుందో ఏమో..!