Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాన్ స్టాప్..ఫన్ సీన్లు

నాన్ స్టాప్..ఫన్ సీన్లు

అవుట్ అండ్ అవుట్ ఫన్ టోన్ లో రెడీ అవుతోంది జాతిరత్నాలు సినిమా. దర్శకుడు నాగ్ అశ్విన్ తొలిసారి నిర్మాతగా వ్యవహరిస్తూ అందిస్తున్న సినిమా. వచ్చేవారం విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రయిలర్ ను హీరో ప్రభాస్ ఆన్ లైన్ లో విడుదల చేసారు.

ఇప్పటికే జాతి రత్నాలు సినిమా మీద కాస్త ఆశలు వున్నాయి. మంచి ఫన్ సినిమా వస్తోందనే భావన వుంది. ట్రయిలర్ ఆ విషయాన్ని దృష్టిలో వుంచుకునే కట్ చేసినట్లు కనిపిస్తోంది. సినిమాలోని ఫన్ సీన్లు  తీసుకువచ్చి గుదిగుచ్చి ట్రయిలర్ లో పేర్చేసారు.

సినిమాలో స్టోరీ అన్నది బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారో లేక స్టోరీ ఇదేనేమో అన్నట్లు వుంది ట్రయిలర్. బేవార్స్ బ్యాచ్ ముగ్గురు జీవితాలు ఎక్కడో ఒక దగ్గర సినిమాటిక్ టర్నింగ్ తీసుకోకతప్పదు. ఆ టర్నింగ్, ఆ వ్యవహారం మొత్తం ట్రయిలర్ లోకి వీలయినంత వరకు రాకుండా జాగ్రత్త పడ్డారు.

ఆ యాంగిల్ డబ్బు చుట్టూ తిరుగుతుందనే చిన్న లీడ్ మాత్రం ఇచ్చి ఊరుకున్నారు. నవీన్ పోలిశెట్టి అవుట్ మంచి సపోర్ట్ గా వున్నాడు సినిమాకు అని అర్థం అయిపోతోంది. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఓకె. ఒక్క సీన్ అయినా వెన్నెల కిషోర్ మెరిసాడు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?