థియేటర్లలో అంతంతమాత్రంగా (50శాతం ఆక్యుపెన్సీ కారణంగా) టాలెంట్ చూపించిన సాయితేజ్, బుల్లితెరపై మాత్రం విజృంభించాడు. అతడు నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమాకు మంచి టీఆర్పీ వచ్చింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగులో ఈ సినిమాను ప్రసారం చేస్తే ఏకంగా 6.69 రేటింగ్ వచ్చింది.
సాయితేజ్ కెరీర్ లో సెకెండ్ బెస్ట్ టీఆర్పీ ఇది. ఇంతకుముందు ఇతడు నటించిన ప్రతిరోజూ పంగడే సినిమాను స్టార్ మా ఛానెల్ లో ప్రసారం చేస్తే, రికార్డ్ స్థాయిలో 15.13 టీఆర్పీ వచ్చింది. ఆ సినిమా తర్వాత సాయితేజ్ కెరీర్ లో హయ్యస్ట్ టీఆర్పీ తీసుకొచ్చిన మూవీ సోలో బ్రతుకే సో బెటర్.
టీవీల్లో ఆ రోజున ప్రసారమైన సినిమాల్లో మరో పెద్ద సినిమా లేకపోవడం సాయితేజ్ కు, ఆ ఛానెల్ కు కలిసొచ్చింది. థియేటర్లలో సినిమా చూడని వాళ్లంతా టీవీలకు అతుక్కుపోయారనే విషయం అర్థమైంది.
ప్రస్తుతం ఈ హీరో, దేవకట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ అనే పొలిటికల్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా జీ తెలుగు ఛానెలే దక్కించుకుంది.