దేశంలో నివాస యోగ్య నగరాల్లో మన పొరుగునే ఉన్న బెంగళూరుకు అగ్రస్థానం దక్కింది. ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ సూచీ జాబితాను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 111 నగరాలతో జాబితా రూపొందించారు.
ఇందులో బెంగళూరు టాప్ ర్యాంక్ దక్కించుకుని దక్షిణాదికి పేరు తెచ్చింది. ఆ తర్వాత పుణె, అహ్మదాబాద్, చెన్నై, సూరత్, నవీముంబయి, కోయంబత్తూర్, వడోదర, ఇండోర్, గ్రేటర్ ముంబయి టాప్ 10లో ఉండడం గమనార్హం.
ఈ నగరాల్లో పుణే (మహారాష్ట్ర), చెన్నై (తమిళనాడు), నవీముంబయి (మహారాష్ట్ర), కోయంబత్తూర్ (తమిళనాడు), గ్రేటర్ ముంబయి (మహారాష్ట్ర) …దక్షిణభారదేశంలో ఉండడం గమనార్హం.
దేశంలో నివాస యోగ్యమైన టాప్ టెన్ నగరాల్లో బెంగళూరు, పుణే, చెన్నై, కోయంబత్తూర్, నవీ ముంబయి, గ్రేటర్ ముంబయి దక్షిణాదికి చెందిన ఆరు నగరాలో చోటు దక్కించుకోవడం విశేషం.
ఇక పది లక్షల లోపు జనాభా కలిగిన 62 నగరాల్లో సిమ్లా అగ్రస్థానంలో ఉంది. ఇందులో మన ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడు చోటు దక్కించుకోవడం విశేషం. అందులోనూ టాప్ టెన్ నగరాల్లో కాకినాడ ఉండడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఇక పది లక్షల లోపు జనాభా కేటగిరీలో దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. నగరాల్లో జీవన స్థితిగతులపై అనుకూల పరిస్థితులను అధ్యయనం చేసి ఈ ర్యాంక్‌లను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ విడుదల చేసింది.