కొత్త లైన్ లో దేవీ ట్యూన్

ఉప్పెన సినిమాతో తన స్టామినా చాటుకున్నాడు సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్. అద్భుతమైన పాటలు, అలాగే బ్యాక్ గ్రవుండ్ స్కోర్ తో సినిమాను నిలబెట్టేసాడు. లేటెస్ట్ గా నితిన్ హీరోగా తయారవుతున్న రంగ్ దే కు…

ఉప్పెన సినిమాతో తన స్టామినా చాటుకున్నాడు సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్. అద్భుతమైన పాటలు, అలాగే బ్యాక్ గ్రవుండ్ స్కోర్ తో సినిమాను నిలబెట్టేసాడు. లేటెస్ట్ గా నితిన్ హీరోగా తయారవుతున్న రంగ్ దే కు వర్క్ చేస్తున్నాడు.

ఈ సినిమా నుంచి ఒక్కోపాట విడుదల చేస్తున్నారు. ఈ రోజు విడుదల చేసిన ' నా కనులు ఎపుడు కనెని కనని' పాట ఇన్ స్టాంట్ గా హిట్ కళను సంతరించుకుంది. ఈ పాటలో తోలి విశేషం ఏమిటంటే, సిద్దూ శ్రీరామ్ తొలిసారి దేవీశ్రీ డైరక్షన్ లో పాట పాడడం. శ్రీమణి రచన చమక్కు కలిసి పాటను సూపర్ హిట్ చేసేసాయి.

అయితే సునిశితంగా పాటను వింటే గతంలో మ్యూజిక్ డైరక్టర్ రాధాకృష్ణన్ అందించిన ఆనంద్ తదితర ఆల్బమ్ లు గుర్తుకు వచ్చాయి. ఇనుస్ట్రుమెంటేషన్, ఆలాపన ఆ స్టయిల్ కు దగ్గరగా వుంది. 

నిజానికి ఇది దేవీ రెగ్యులర్ స్టయిల్ కానే కాదు. కొత్తగా ట్రయ్ చేసారు. కానీ ఆ ట్రయ్ చేసింది రాధాకృష్ణన్ స్టయిల్ కు దగ్గరగా వుండడం యాదృచ్ఛికం కావచ్చు.