Advertisement

Advertisement


Home > Movies - Movie News

వకీలు పాట కాదు, హీరో పాట

వకీలు పాట కాదు, హీరో పాట

వకీల్ సాబ్ లో హీరో ఇంట్రడక్షన్ లాంటి హీరో వర్షిప్ సాంగ్ 'సత్యమేవజయతే' ను విడుదల చేసారు. దీని మీద పలు మీమ్స్, విమర్శలు వస్తున్నాయి. 

రచయిత రామ జోగయ్య కూడా స్పందించి సినిమా విడుదలయ్యాక  చూద్దాం అనేసారు. ఆయన ఇలా అనడానికి కారణం వుంది. సినిమాలో ఈ పాట వకీల్ సాబ్ మీద రాదు.

పింక్ లో లేనిది, వకీల్ సాబ్ లో వున్నది ఏమిటంటే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్. వకీల్ కు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వుంటుంది. అందులో ఆయన అన్యాయాలను, అక్రమాలను సహరించడు. 

సమాజంలో ఏం తప్పు జరిగినా నిలదీస్తాడు. ఈలాంటి క్యారెక్టర్ మీద ఓ మాంటేజ్ సాంగ్. దానికి తగినట్లు సీన్లు అన్నీ పేర్చుకున్నారు. సహజంగానే పవన్ తరచు ప్రవచించే జనసేన సిద్దాంతాలకు అనుగుణంగా వుంటాయి ఈ సీన్లు. దానికి అనుగుణంగా ఈ పాట. 

సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది కాబట్టి ఎవ్వరూ తప్పు పట్టడానికి వుండదు. అందుకే రామ్ జోగయ్య అలా అనేసారు. సినిమా విడుదలయ్యాక మాట్లాడుకుందాం అని.

తానకు వెట‌క‌రం ఎక్కువగా ఉంటుంది

ఆర్కే నాయుడు క్యారెక్ట‌ర్ ని ఎవ‌రూ రీప్లేస్ చేయ‌లేరు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?