బ్రేక్ తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించిన న‌టి

టీమిండియా మాజీ క్రికెట్ ప్లేయ‌ర్ యువ‌రాజ్ సింగ్ భార్య‌, బాలీవుడ్ న‌టి హ‌జెల్ కీచ్ బ్రేక్ తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే ఆ బ్రేక్ యువ‌రాజ్‌తో అనుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్టే. ఇంత‌కూ ఆమె తీసుకునే బ్రేక్…

టీమిండియా మాజీ క్రికెట్ ప్లేయ‌ర్ యువ‌రాజ్ సింగ్ భార్య‌, బాలీవుడ్ న‌టి హ‌జెల్ కీచ్ బ్రేక్ తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే ఆ బ్రేక్ యువ‌రాజ్‌తో అనుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్టే. ఇంత‌కూ ఆమె తీసుకునే బ్రేక్ ఏంటో తెలుసుకోవాలంటే… కథ‌నంలోకి వెళ్దాం పదండి.

యువరాజ్‌ సింగ్ భార్య, బాలీవుడ్‌ నటి హజెల్‌ కీచ్ గురువారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స‌ద‌రు కీల‌క ప్ర‌క‌ట‌న‌ను వెల్ల‌డించారామె. కొంత కాలం పాటు త‌న‌కు స్నేహితులు, బంధుమిత్రులెవ‌రైనా మెసేజ్ చేయ‌వ‌ద్ద‌ని ఆమె కోరారు. కీల‌క ప్ర‌క‌ట‌న‌కు సంబంధించి పూర్తి పోస్ట్ గురించి తెలుసుకుందాం.

“నేను, నా ఫోన్‌ బ్రేక్‌ తీసుకుంటున్నాం. ఈ విషయం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుందని నాకు తెలుసు, కానీ తప్పదు! పూర్తిగా ఒకరిపై ఒకరం ఆధారపడటం అలవాటైన మనకు ఒంటరిగా ఎలా బతికేవాళ్లమో గుర్తుకు రావాలంటే ఇలాంటి బ్రేక్స్‌ తీసుకోవాల్సిందే. 

కాబట్టి సోషల్‌ మీడియాకు నేను వీడ్కోలు పలుకుతున్నాను. కానీ ఇది తాత్కాలికమే. మళ్లీ సోషల్‌ మీడియాలో మీ అందరినీ పలకరిస్తాను. అయితే అది అంత తొందరగా కాదులెండి. కనుక ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే మెసేజ్‌కు బదులు ఫోన్‌ చేయండి” అంటూ ఓ లేఖను ఆమె  షేర్ చేశారు.

ఇంత‌కూ యువ‌రాజ్ సింగ్ భార్య ఎవ‌రితో బ్రేక్ తీసుకుంటున్నారో తెలిసింది క‌దా? ఒక్కొక్క‌రి ఆలోచ‌నా తీరు ఒక్కోలా ఉంటుంది.  ఒంటరిగా ఎలా బతికేవాళ్లమో గుర్తుకు రావాలంటే ఇలాంటి బ్రేక్ అవ‌స‌ర‌మ‌ని ఆమె భావిస్తున్నారు. అందుకే సోష‌ల్ మీడియాకు తాత్కాలికంగా వీడ్కోలు ప‌ల‌కాల‌నే ఆమె నిర్ణ‌యాన్ని ఎలా కాదంటాం? 

ఆర్కే నాయుడు క్యారెక్ట‌ర్ ని ఎవ‌రూ రీప్లేస్ చేయ‌లేరు

తానకు వెట‌క‌రం ఎక్కువగా ఉంటుంది