Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నోటా.. లాలూ.. రబ్రీ.. స్ఫూర్తి?

నోటా.. లాలూ.. రబ్రీ.. స్ఫూర్తి?

నోటాలో వీళ్ల కథ వుంది.. వాళ్ల పాత్రలు వున్నాయి అన్న టాకులు వున్నాయి. కానీ అన్నీ తాటకుల టాకులే అని తెలుస్తోంది. ఏ తెలుగు రాజకీయ నాయకుల వ్యవహారాలు నోటాలో లేవని వినికిడి. అయితే కథలో ఓ పాయింట్ మాత్రం బీహార్ సిఎమ్ లాలూ-రబ్రీదేవిల స్ఫూర్తి వుండొచ్చని తెలుస్తోంది.

అవినీతి కేసులు మీద పడడంతో లాలూప్రసాద్ యాదవ్ తను గద్దెదిగిపోయి, భార్య రబ్రీదేవిని గద్దెనెక్కించారు. అలాగే నోటాలో కూడా అవినీతి కేసులు మీద పడడంతో అమెరికా నుంచి కొడుకును తీసుకువచ్చి, ముఖ్యమంత్రి సీట్లో కూర్చోపెట్టే వ్యవహారం వుందని తెలుస్తోంది.

కానీ నిజంగా తండ్రి అవినీతి పరుడు కావడంతో కొడుకు ఎదురుతిరిగే లాంటి పాయింట్ ఏదో జోడించి, దీనికి తమిళ రాజకీయాలను పెనవేసినట్లు తెలుస్తోంది. మొత్తంమీద చూసుకుంటే భరత్ అనే నేను పాయింట్ ను టచ్ అవుతున్నా, డిఫరెంట్ కానెప్ట్ కనిపిస్తోంది.

విజయ్ దేవరకొండ తన స్టయిల్ లో ఎలా చేసాడో అన్న ఆసక్తి అయితే జనాల్లో వుంది. సీరియస్ సినిమాలు మిగిలిన వాళ్లకు నాన్ ఓకె కావచ్చు కానీ, విజయ్ కు ఓకెనే. అర్జున్ రెడ్డి లాంటి సినిమాతోనే మెప్పించాడు అతగాడు. నోటా మీద కూడా అవే ఆశలు వున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?