మొన్నటివరకు శ్రీరెడ్డి లీక్స్ మాత్రమే చూశాం. ఇప్పటికీ మినిమం గ్యాప్ లో శ్రీరెడ్డి ఎవరో ఒకరిపై ఆరోపణలు చేస్తూనే ఉంది. ఇప్పుడు శ్రీరెడ్డికి పోటీగా పూనమ్ కౌర్ కూడా తయారైంది. నేరుగా లీక్స్ అని చెప్పకపోయినా, ఈమె కూడా ఇప్పుడు పలువురు సినీప్రముఖులపై పరోక్షంగా ట్వీట్స్ చేస్తోంది.
“ఇండస్ట్రీలో ఓ డైరక్టర్ ఉన్నాడు. కేవలం సినిమాల్నే కాదు, మనుషుల్ని కూడా డైరక్ట్ చేస్తుంటాడు. నన్ను కూడా డైరక్ట్ చేయాలని చూశాడు. అందులో భాగంగా మాయచేశాడు కూడా. దానిపై నేను వివరణ కోరాను. ఏం జరగనట్టు నటించాడు. కేవలం అతడికి సంబంధించిన అమ్మాయిలే ఇండస్ట్రీలో ఉండాలని కోరుకుంటాడు.”
ఇలా ఓ దర్శకుడిపై విమర్శలు చేసింది పూనమ్ కౌర్. ఆమె ఆరోపణలు చేసిన దర్శకుడు కచ్చితంగా టాలీవుడ్ కు చెందిన డైరక్టర్ అనే విషయం స్పష్టం. కాకపోతే అతడు ఎవరనేది మాత్రం పూనమ్ చెప్పలేదు.
“అతడికి చెందిన హీరోయిన్లలో ఒకరు ఇప్పుడు వరుసగా ఫ్లాపులిస్తోంది. కానీ ఆమెకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కారణాలేంటో తెలీదు. ఇండస్ట్రీలో ఏం జరుగుతోందో అర్థం కావడంలేదు.”
ఈ విషయంలో కాస్టింగ్ కౌచ్ అనే పదం వాడలేదు పూనమ్ కౌర్. దాని స్థానంలో ఫేవరిటిజం అనే పదం వాడింది. వాడిన పదం ఏదైనా ఆమె అర్థం మాత్రం ఒక్కటే. సదరు దర్శకుడికి తెరవెనక “సేవలు” చేసిన హీరోయిన్లకే అవకాశాలు వస్తున్నాయనేది పూనమ్ ట్వీట్ల సారాంశం. ఇదే ఊపులో ఆ దర్శకుడి పేరును ఆమె బయటపెడుతుందేమో చూడాలి.