రవితేజకు నచ్చిన, వచ్చిన సూపర్ కాంప్లిమెంట్ ఏమిటో తెలుసా? ఎవరిచ్చారో తెలుసా? ఆ విషయం రవితేజనే వెల్లడించాడు. తను నటించిన నేలటికెట్ ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించాడు.
ఎప్పుడో పదేళ్ల కిందట పవన్ ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నట్లుండి.. 'మీరు ఇంత సిగ్గులేకుండా ఎలా నటిస్తారండీ' అన్నారట. అప్పటి నుంచి అదే తనకు నచ్చిన అద్భుతమైన కాంప్లిమెంట్ అని, మళ్లీ అలాంటి కాంప్లిమెంట్ రాలేదని చెప్పాడు రవితేజ.
రవితేజ అంటే చాలా ఇష్టం
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రవితేజ అంటే తనకు చాలా ఇష్టం అని, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారని అంటూ, తను ఇచ్చిన కాంప్లిమెంట్ కు వివరణ ఇచ్చాడు.
రవితేజ ఎలాంటి క్యారెక్టర్ అయినా, ఎంత మంది చుట్టూ వున్నా సిగ్గు పడకుండా చేస్తాడని, తాను అలా చేయలేక పారిపోతానని, అందుకే ఏకంగా పారిపోయానని చమత్కరించాడు. నవ్వించడం అంత సులువు కాదని, గుండెల్లో ఎక్కడో చిన్న బాధ వుంటే తప్ప, ఇంత మందిని నవ్వించడం కష్టమని పవన్ అన్నారు.
నిర్మాత తాళ్లూరి రామ్ తనుకు ఇష్టుడు, స్నేహితుడు అని, వాళ్లంతా తనకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని పవన్ వెల్లడించారు.