ఈ మాట అన్నది ఎవరో కాదు..టెంపర్ నిర్మాత బండ్ల గణేష్..ఆయన తన సినిమా దర్శకుడు పూరి జగన్నాధ్ తో కలిసి టీవీ 9 లో మాట్లాడినపుడు ఇలా అన్నారు. ఎన్టీఆర్ కు కాస్త లేడీస్ ఫాలోయింగ్ తక్కువ. అది, ఇంకా వున్న ఇతర లోపాలు అన్నింటినీ మా టెంపర్ సినిమా సెట్ చేసేసింది అని వివరించారు.
Advertisement
మరి ఆ మిగిలిన లోపాలేంటో మాత్రం వివరించలేదనుకోండి. మాస్ ఫాలోయింగ్ వున్న హీరో ఎన్టీఆర్. అందులో అనుమానం లేదు. బృందావనం లాంటి సినిమా మాంచి హిట్ కావడమే కాదు, ఫ్యామిలీలకు పిచ్చపిచ్చగా నచ్చేసింది. మరి అలాంటి ఫాలోయింగ్ వున్న ఎన్టీఆర్ కు లేడీస్ ఫాలొయింగ్ తక్కువంటాడేమిటి బండ్ల?