అక్కినేని హీరోలకి ఇంతవరకు నలభై కోట్ల షేర్ వచ్చిన సినిమా లేదు. 38 కోట్ల షేర్ సాధించిన మనం అక్కినేని హీరోల కెరీర్లో బిగ్గెస్ట్ హిట్. ఈ నేపథ్యంలో అక్కినేని అఖిల్ మార్కెట్ ఎంత ఉంటుందో అంచనా వేయలేకపోతున్నారు అతని తొలి చిత్ర నిర్మాతలు. నితిన్ ఫ్యామిలీ నిర్మిస్తోన్న అఖిల్ మొదటి సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది.
అయితే ఈ చిత్రానికి ఎంత ఖర్చు పెడితే సేఫ్ వెంఛర్ అవుతుంది, దీనికి ఎంత బిజినెస్ జరుగుతుంది అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదట. వినాయక్‌కి స్టాండర్డ్ మార్కెట్ అయితే ఉంది. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ లేని హీరోతో అతను తీసిన ‘అల్లుడు శీను’ పాతిక కోట్ల వరకు బిజినెస్ చేసింది. ఆ లెక్కన అఖిల్ సినిమాకి అంతకంటే ఎక్కువే వస్తుందని అనుకోవచ్చు.
ముప్పయ్, ముప్పయ్ అయిదు కోట్ల పరిధిలో ఖర్చుని లిమిట్ చేసినట్టయితే నిర్మాతలకి ఇది సేఫ్ వెంఛర్ అవుతుందని అనుకోవచ్చు. సూపర్‌స్టార్స్ సరసన చేరతాడని అభిమానులు అంచనా వేస్తున్న అఖిల్ తొలిసారిగా అక్కినేని పేరుని నలభై కోట్ల క్లబ్‌లోకి చేరుస్తాడేమో చూడాలి.