ఎన్టీఆర్‌కి.. ప్రధానంగా నందమూరి హీరోల చిత్రాలకి మాస్ సెంటర్స్‌లో కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి. ఏ సెంటర్స్‌లో కంటే బి, సి కేంద్రాల్లో వీరి చిత్రాలు స్ట్రాంగ్‌గా ఉంటాయి. నైజాం, ఓవర్సీస్ కంటే కూడా సీడెడ్, ఆంధ్ర ప్రాంతాల్లో నందమూరి హీరోల సినిమాలు బాగా ఫేర్ చేస్తుంటాయి. కానీ ‘టెంపర్’ విషయంలో సీన్ రివర్స్ అయింది.
‘టెంపర్’ టైటిల్ నుంచి ట్రెయిలర్స్ వరకు మాస్‌ని ఆకట్టుకునేలానే మలిచారు. సినిమాలో కామెడీ కంటే యాక్షన్, ఎమోషన్ ఎక్కువ ఉండడంతో ఈ చిత్రం ఏ సెంటర్స్ కంటే బి,సిల్లో బాగా పర్‌ఫార్మ్ చేస్తుందని అనుకున్నారు. కానీ టెంపర్ ఏ సెంటర్స్‌లో స్ట్రాంగ్‌గా రన్ అవుతూ, బి అండ్ సిల్లో యావరేజ్‌గా పర్‌ఫార్మ్ చేస్తూ ఉండడంతో ట్రేడ్ పండితులు కూడా షాకవుతున్నారు.
ఓవర్సీస్‌లో ఇప్పటికే విజయాన్ని అందుకున్న టెంపర్ నైజాంలో కూడా చాలా స్ట్రాంగ్‌గా రన్ అవుతోంది. హైదరాబాద్‌లో పలు ఏరియాల్లో సోమవారం కూడా హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఆంధ్ర ప్రాంతంలోని బి, సి కేంద్రాల్లో మాత్రం వసూళ్లు డ్రాప్ అయ్యాయి. ఎన్టీఆర్ ఏ సెంటర్స్‌లో స్ట్రాంగ్ అయ్యాడని ఆనందపడాలో, ఈ చిత్రానికి మాస్ ఆడియన్స్ నుంచి ఆశించిన స్పందన రావడం లేదని నిరాశ చెందాలో ఎన్టీఆర్ ఫాన్స్‌కి అర్థం కాకుండా ఉంది.