లోకేష్ బాబు మంత్రి పదవి ప్రమాణస్వీకార సభకు నందమూరి వంశానికి చెందిన కిత్ అండ్ కిన్ అందరూ తరలి వెళ్లారు. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ, సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా వెళ్లారు. అయితే ఎన్టీఆర్ మాత్రం వెళ్లలేదు. దీని వెనుక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది.
ఈ కార్యక్రమానికి నందమూరి ఫ్యామిలీ జనాలందరికీ ఓరల్ గానో, మెసేజ్ రూపంలోనో, పిలపులు అందాయట. కానీ ఒక్క ఎన్టీఆర్ ను మాత్రం ఆహ్వానించలేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అందరినీ పిలిచి ఇలా ఎన్టీఆర్ ను మాత్రం పిలవకపోవడం ఏమిటో?
ఆరంభం నుంచి లోకేష్ కోసమే చంద్రబాబు ఎన్టీఆర్ ను మెల్లగా పక్కకు తప్పించారన్న వదంతులు వున్నాయి. అయితే హరికృష్ణ, కళ్యాణ్ రామ్ మాత్రం ఎన్టీఆర్ తోనే వుంటూ, ఆయనకు అండగా నిలిచారు. అలాంటిది ఇప్పుడు వాళ్లను పిలిచి, ఎన్టీఆర్ ను పిలవకపోవడం అంటే బాబు కావచ్చు, లోకేష్ కావచ్చు ఏమని భావిస్తున్నట్లు?
ఎన్టీఆర్ ను నందమూరి ఫ్యామిలీ అని గుర్తించడం లేదనా? లేదా అందరినీ పిలిచి అతనిని మాత్రం పిలవకపోవడం అంటే కావాలని అవమానించడం అనా? లేదా హరికృష్ణ ఫ్యామిలీలోనే చీలికలు తేవాలనా?
అయినా తమ్ముడిని, కొడుకుని పిలవనపుడు హరికష్ణ, కళ్యాణ్ రామ్ మాత్రం ఎందుకు హాజరయనట్లో?