ఎన్టీఆర్ ఇప్పుడు మునుపటి ఎక్కువగా తన కెరీర్ మీద శ్రద్ధ పెడుతున్నాడు. గతంలో దర్శకులని నమ్మి సినిమాలు చేసేసేవాడు. వాళ్లు ఒళ్లు దగ్గరెట్టుకుని తీస్తే హిట్టు.. లేదంటే ఫట్టు అన్నట్టుండేది. కానీ ఎన్టీఆర్ ఇక దర్శకుల మునుపటి ట్రాక్ రికార్డ్‌ని పట్టించుకోవడం లేదు. హిట్స్ ఇచ్చిన దర్శకులైనా, ఫ్లాపులిచ్చిన వారైనా సరే… తనని మంచి కథతో ఇంప్రెస్ చేస్తే డేట్స్ ఇచ్చేస్తున్నాడు.
హరీష్ శంకర్‌ని నమ్మి రామయ్యా వస్తావయ్యా చేసినందుకు ఎన్టీఆర్‌కి గబ్బర్‌సింగ్ రాకపోగా.. షాక్ తగిలింది. అంతకుముందోసారి పూరి జగన్నాథ్ కూడా ఏదో పొడిచేస్తాడని ఆంధ్రావాలా బారిన పడ్డాడు. అందుకే తన అనుభవాలు నేర్పిన పాఠంతో ఎన్టీఆర్ రాటుదేలిపోయాడు. ఫ్లాపిచ్చిన సుకుమార్‌తో అయినా… హిట్టిచ్చిన మరెవరితో అయినా చేయడానికి రెడీ అంటున్నాడు.
కాకపోతే తనని ఒక అదిరిపోయే కథతో మెప్పించాలి. చెప్పినట్టుగా తీసి చూపించాలి. ఎన్టీఆర్ ఈ నిబంధనలు విధించి ఖచ్చితంగా అమల్లో పెట్టడంతో అతడిని మెప్పించే కథ చెప్పడానికి దర్శకులకి తల ప్రాణం తోకకి వస్తోందట. అల్లాటప్పా కథల్తో వెళితే ఎన్టీఆర్ దగ్గర నో ఎంట్రీ బోర్డు దాటడం కష్టమట.