ఎనర్జిటిక్ హీరో రామ్‌కి వరుసగా తగిలిన ఎదురు దెబ్బలతో అతని సినిమాల మార్కెట్ పడిపోయింది. మసాలా చిత్రానికి రామ్ ఎస్సెట్ అవుతాడని అనుకుంటే… అతడే మైనస్ అయ్యాడు. వెంకటేష్ అంతకుముందు మహేష్‌తో కలిసి నటిస్తే ఎక్సయిట్ అయిన జనం.. రామ్‌తో వెంకీ అంటే అస్సలు కేర్ చేయలేదు.
ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త ఎఫెక్ట్ రామ్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసింది. ఈసారి ఎక్కువ, తక్కువలు కాకుండా ఎట్టి పరిస్థితుల్లోను హిట్టు కొట్టి తీరాలని రామ్ కసిగా ఉన్నాడు. లక్కీగా అతనికి అల్లు అర్జున్ కోసం గోపీచంద్ మలినేని రాసుకున్న ‘పండగ చేస్కో’ సబ్జెక్ట్ దొరికింది. బన్నీ బిజీగా ఉండడంతో గోపీచంద్ ఇటు షిఫ్ట్ అయిపోయాడు.
ఈ సినిమాతో తన పరాజయాల పరంపరకి బ్రేకేయాలని, తిరిగి మునుపటిలా బ్యాంకబుల్ హీరో కావాలని రామ్ ఆశిస్తున్నాడు. రామ్లానే దారుణమైన ఫామ్‌లో ఉన్న రవితేజకి గోపీచంద్ ‘బలుపు’తో హిట్టిచ్చాడు. ఇప్పుడు తనతోను అదే ఫీట్ రిపీట్ చేస్తాడని రామ్ కోరుకుంటున్నాడు.