బిగ్ బాస్ షో ఫస్ట్ వీకెండ్ హంగామా ముగిసింది. షో ప్రారంభంలో ఎన్టీఆర్ శైలిపై మిశ్రమ స్పందనలు వెలువడ్డాయి. కాస్త డ్రామా మిక్సయిందన్న కామెంట్లు వినిపించాయి. సరే, ఆ తరువాత ఎన్టీఆర్ లేకుండా కేవలం హవుస్ మేట్ లు మాత్రం కొన్నాళ్లు జనాలకు కాస్త బోర్ కొట్టించారు.
కానీ వీకెండ్ లో ఎన్టీఆర్ రెండు రోజుల పాటు వచ్చి, దుమ్ము దులిపేసి, షోకి హుషారు తెప్పించాడు. టోటల్ షోను చేతిలో ఎటువంటి రిఫరెన్స్ లు లేకుండా, చాలా సెటిల్డ్ గా, ఎక్కడా తడబడకుండా నడపడం అంటే అంత సులువు కాదు. కానీ ఎన్టీఆర్ ఆ టాస్క్ ను చాలా సమర్థవంతంగా నిర్వహించారు. మాటల విరుపు, పలుకుబడి, హావ భావాలు, స్టెప్ బై స్టెప్ పెర్ ఫెక్ట్ టైమింగ్ తో కార్యక్రమాన్ని రక్తికట్టించారు.
నిజానికి ఇంత స్క్రిప్ట్ ను, స్టెప్ బై స్టెప్ గుర్తు పెట్టుకుని, షో నడపడం ఒకఎత్తు, వన్ వీక్ కార్యక్రమం అంతా ఎట్ ఎ గ్లాన్స్ బుర్రలో పెట్టుకోవడం ఇంకో ఎత్తు. అదే విధంగా పాత విషయాలు, కొత్త సంగతులు మిక్స్ చేస్తూ మాట్లాడడం కూడా ఎన్టీఆర్ చేసిన గట్టి కసరత్తును తెలియచేస్తుంది.
మొత్తం మీద బిగ్ బాస్ షోలో ఫస్ట్ వీక్ లోనే శభాష్ అనిపించేసుకున్నాడు ఎన్టీఆర్. కొసమెరపు ఏమిటంటే, ఎలిమినేషన్ ప్రొసీజర్ అయిన తరువాత ఓపెన్ స్టేజ్ మీద చేసిన పోస్ట్ మార్టమ్, షోను రక్తికట్టించిడమే కాక, ప్యూచర్ షో కూడా రక్తి కట్టడానికి ఉపయోగపడేలా వుంది.