సుకుమార్‌కి ఎన్టీఆర్ స‌పోర్డ్‌

అంద‌రిలా క‌మ‌ర్షియ‌ల్ ఫార్మెట్‌లోనే ఆలోచించి, సింపుల్ గా సినిమా చుట్టేసి, నాలుగు డ‌బ్బులు వెన‌కేసుకొనే లౌక్యం తెలియ‌ని ద‌ర్శకుడు సుకుమార్‌. ఫ్లాపో, హిట్టో… కాస్త కొత్తగా ఆలోచిస్తాడు. వ‌న్ విష‌యంలో ఆ కొత్తద‌నం మ‌రీ…

అంద‌రిలా క‌మ‌ర్షియ‌ల్ ఫార్మెట్‌లోనే ఆలోచించి, సింపుల్ గా సినిమా చుట్టేసి, నాలుగు డ‌బ్బులు వెన‌కేసుకొనే లౌక్యం తెలియ‌ని ద‌ర్శకుడు సుకుమార్‌. ఫ్లాపో, హిట్టో… కాస్త కొత్తగా ఆలోచిస్తాడు. వ‌న్ విష‌యంలో ఆ కొత్తద‌నం మ‌రీ ఎక్కవవ్వడంతో దెబ్బయిపోయాడు. ఇక నుంచి ప్రయోగాలు చేయ‌కూడ‌దు అని గ‌ట్టిగా తీర్మాణించేసుకొన్నాడు. 

అయితే సుకుమార్‌ని మాత్రం ఒక‌రి నుంచి బాగా స‌పోర్ట్ వ‌స్తోంది. ప్రయోగాలు చేయ్‌.. చేయ్‌… అంటూ ఓ హీరో ప్రోత్సహిస్తున్నాడు. ఆ హీరో ఎవ‌రో కాదు.. ఎన్టీఆర్‌. సుకుమార్‌కి ఇప్పుడు ఎన్టీఆర్ సీరియ‌స్‌గా కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాడ‌ట‌.  ఈమ‌ధ్య '1' సినిమా చూశాడు ఎన్టీఆర్‌. అది బాగా న‌చ్చింద‌ట‌. 

అందుకే  ''నువ్వు నీ పంథాలోనే సినిమా తీయ్‌. ఆలోచ‌న మార్చుకోకు. నేను నిన్ను ప‌పోర్ట్ చేస్తా..'' అంటున్నాడ‌ట ఎన్టీఆర్‌. స్వయంగా హీరోనే ఇలా ప్రొత్సహిస్తే.. సుక్కు ఊరుకొంటాడా??  మ‌రింత రెచ్చిపోడూ. మ‌రి త‌న త‌ర‌వాతి సినిమాలో ఎన్టీఆర్ ని సుకుమార్ ఎలా చూపిస్తాడో..?