ఒట్టు… మ‌రోటి!

సాధార‌ణంగా మంచు హీరోల‌తో ఎవ‌రికోగానీ ట్యూన్ కాదు. ట్యూన్ అయితే మాత్రం అస్సలు వ‌దులుకోరు. ప్రస్తుతం మంచు హీరోల‌కు రాంగోపాల్ వ‌ర్మ బాగా ట్యూన్ అయ్యాడు. మోహ‌న్ బాబు, విష్ణుల‌తో వ‌ర్మ ఓ సినిమా…

సాధార‌ణంగా మంచు హీరోల‌తో ఎవ‌రికోగానీ ట్యూన్ కాదు. ట్యూన్ అయితే మాత్రం అస్సలు వ‌దులుకోరు. ప్రస్తుతం మంచు హీరోల‌కు రాంగోపాల్ వ‌ర్మ బాగా ట్యూన్ అయ్యాడు. మోహ‌న్ బాబు, విష్ణుల‌తో వ‌ర్మ ఓ సినిమా తీస్తున్నాడు. అయితే వ‌ర్మ టేకింగ్ స్టైల్, స్పీడ్ చూసి మోహ‌న్ బాబు తెగ ముచ్చట‌ప‌డిపోతున్నారు. 

త‌న‌ని ఎవ‌రు క‌లిసినా స‌రే, వ‌ర్మ భ‌లే తీస్తున్నాడు – అంటూ కితాబిస్తున్నార‌ట‌. అంతేకాదు ఇప్పుడు వ‌ర్మతో మ‌రో సినిమా కూడా చేయ‌బోతున్నారు. రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో ప్రస్తుతం ఓ సినిమా తెర‌కెక్కిస్తున్నారు. దీనికి ఒట్టు అనే పేరు పరిశీలిస్తున్నారు. అది పూర్తవ్వగానే మ‌రో సినిమా కూడా సెట్స్ పైకి వెళ్తుంది. 

ఇందులో కూడా మోహ‌న్‌బాబు న‌టిస్తారు. రెండో హీరో విష్ణునా, లేదంటే మంచు మనోజ్ అనేది మాత్రం తేలాల్సివుంది. ఏం చూపించి మోహ‌న్ బాబు ద‌గ్గర మార్కులు కొట్టేశాడో వ‌ర్మ‌.