ఇప్పుడు సినిమా జనాలకు అంతా ఒకటే లెక్క. యూట్యూబ్ లో ఎన్ని హిట్ లు వచ్చాయి? అన్నదే. గంటలో ఇన్ని మిలియన్లు వచ్చాయి. అన్ని మిలియన్లు వచ్చాయి అని చెప్పుకోవడం. పెద్ద హీరోల టీజర్ల, మోషన్ పోస్టర్లకు సాధారణంగా క్రేజ్ వుంటుంది. లేదూ అంటే హిట్ కు ఇంత అని ఖర్చు చేసే మార్గం కూడా వుండనే వుంది. అంటే పెయిడ్ హిట్స్ అన్నమాట. ఒకప్పుడు హిట్ కు 60పైసలు కూడా వుండేది. ఇప్పుడు పావలాకు వచ్చేసింది. అందువల్ల కాస్త ఖర్చు పెడితే హిట్ లు పెద్ద కష్టం కాదు.
ఈ సంగతి అలా వుంచితే, ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా టెంపర్ స్టయిల్ లో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లు లుక్ వదిలారు. అయితే ఫ్యాన్స్ చెప్పుకోవాలంటే హిట్ లు వుండాలి. అందుకోసం అప్పటికప్పుడు ప్లాన్ చేసి బర్త్ డే నాడు మోషన్ పోస్టర్ కూడా వదిలాలని ఎన్టీఆర్ టీమ్ ప్లాన్ చేసింది. ఆ మేరకు మోషన్ పోస్టర్ వదిలారు. కానీ చిత్రంగా ఈ పోస్టర్ రికార్డులు ఏమీ సృష్టించలేదు.
మోషన్ పోస్టర్ అయితే బాగుంది. థమన్ ఇచ్చిన ట్యూన్ బాగుంది. దానికి జోడించిన విజువల్ ఎఫెక్ట్స్ అట్రాక్టివ్ గా వున్నాయి. కానీ దాదాపు డే అంతా గడచినా గట్టిగా మూడు లక్షల హిట్స్ రాకపోవడం ఆశ్చర్యం. త్రివిక్రమ్ లాంటి డైరక్టర్, ఎన్టీఆర్ లాంటి హీరో ల ఫస్ట్ మోషన్ పోస్టర్ జనాల్లోకి వెళ్లకపోవడానికి కారణం, దాన్ని ప్రాపర్ గా లాంచ్ చేయలేదని, ఫస్ట్ లుక్ కు చేసిన హడావుడి, మోషన్ పోస్టర్ విషయంలో కనిపించలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
పైగా లుక్, పోస్టర్ ఒకే ఈవెంట్ టైమ్ లో వదలడం అన్నది కూడా కాస్త తేడా చేసిందని వినిపిస్తోంది. అదీ కాక మోషన్ పోస్టర్ ఫైనల్ అయ్యేసరికి ఫైనల్ స్టిల్ కనిపించాలి. అంటే ముక్క ముక్క యాడ్ అయ్యి, ఫుల్ స్టిల్ ఫైనల్ గా రావాలి.
కానీ ఈ పోస్టర్లో హీరో హీరోయిన్లను గట్టిగా అయిదారు సెకెండ్ లు చూపించి, శుభాకాంక్షలతో ఎండ్ చేసి, అక్కడే వదిలేసారు. దాంతో ఎన్టీఆర్ ను హీరోయిన్ ను చూడాలంటే మళ్లీ మళ్లీ వెనక్కు వెళ్లాల్సిందే. అందువల్లే ఈ మోషన్ పోస్టర్ కు రావాల్సిన క్రేజ్ రాలేదని మరో టాక్ వినిపిస్తోంది. ఏదైనా ఫస్ట్ లుక్ కు వచ్చిన క్రేజ్, మోషన్ పోస్టర్ కు రాలేదనే చెప్పాలి. ఎన్టీఆర్ డిజిటల్ టీమ్ కూడా ఈ విషయంలో కాస్త ఉదాసీనంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. లేదూ అంటే పట..పటా..మిలియన్ల హిట్ లు రాలి వుండేవి.