ఎన్టీఆర్ తండ్రి క్యారెక్టర్ కు ఎవరు?

టెంప‌ర్ త‌ర‌వాత సుకుమార్ సినిమాతో బిజీ అవ్వనున్నాడు ఎన్టీఆర్‌. సుక్కు ఇప్పటికే స్ర్కిప్టుని పూర్తిస్థాయిలో రెడీ చేసేశాడు. ప్రస్తుతం చిత్రబృందం క‌థానాయిక కోసం అన్వేషిస్తోంది. ఆ మధ్య రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపించింది.…

టెంప‌ర్ త‌ర‌వాత సుకుమార్ సినిమాతో బిజీ అవ్వనున్నాడు ఎన్టీఆర్‌. సుక్కు ఇప్పటికే స్ర్కిప్టుని పూర్తిస్థాయిలో రెడీ చేసేశాడు. ప్రస్తుతం చిత్రబృందం క‌థానాయిక కోసం అన్వేషిస్తోంది. ఆ మధ్య రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపించింది. మరి కన్ ఫర్మ్ అయిందో లేదో తెలియాల్సి వుంది. మరోపక్క అదే హీరోయిన్ చరణ్ తో కూడా చేస్తోంది. 

క‌థానాయిక‌తో పాటు ఎన్టీఆర్‌కి ఓ  'తండ్రి' కూడా కావాలి. తండ్రీ కొడుకుల అనుబంధం నేప‌థ్యంలో సాగే ఓ రివైంజ్ డ్రామా ఈ సినిమా. ఎన్టీఆర్ తండ్రిగా ఓ పాపుల‌ర్ న‌టుడ్ని తీసుకురావాల‌ని చూస్తోంది చిత్రబృందం. ప్రకాష్‌రాజ్‌, రాజేంద్రప్రసాద్‌, జ‌గ‌ప‌తిబాబు… వీళ్లంద‌రినీ తండ్రి పాత్రల్లో చూసేశారు. 

అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కోసం ఓ కొత్త తండ్రిని అన్వేషిస్తున్నార‌ని తెలిసింది. అవ‌స‌ర‌మైతే బాలీవుడ్ న‌టుడ్ని దిగుమ‌తి చేసినా ఫ‌ర్వాలేద‌ని చిత్రబృందం భావిస్తోంద‌ట‌. మ‌రి ఆ పాత్రలో ఎవ‌రు క‌నిపిస్తారో చూడాలి.