అర్జంటుగా ఓ హిట్టు కావలెను

జూ.ఎన్టీఆర్‌కి వున్నపళంగా ఓ కమర్షియల్‌ హిట్‌ కావాలి. ఎందుకంటే టాలీవుడ్‌లో తిరుగులేని హీరోగా దూసుకుపోయిన జూనియర్‌ ఎన్టీఆర్‌, ఇప్పుడు వరుస ఫ్లాపుల్ని చవిచూస్తున్నాడు మరి. ‘రామయ్యా వస్తావయ్యా’ హిట్‌ అయి వుంటే, జూ.ఎన్టీఆర్‌ దూకుడు…

జూ.ఎన్టీఆర్‌కి వున్నపళంగా ఓ కమర్షియల్‌ హిట్‌ కావాలి. ఎందుకంటే టాలీవుడ్‌లో తిరుగులేని హీరోగా దూసుకుపోయిన జూనియర్‌ ఎన్టీఆర్‌, ఇప్పుడు వరుస ఫ్లాపుల్ని చవిచూస్తున్నాడు మరి. ‘రామయ్యా వస్తావయ్యా’ హిట్‌ అయి వుంటే, జూ.ఎన్టీఆర్‌ దూకుడు ఓ రేంజ్‌లో వుండేది. కానీ, ఆ సినిమా దెబ్బతో జూ.ఎన్టీఆర్‌ కెరీర్‌ డైలమాలో పడింది.

బీభత్సమైన మాస్‌ సినిమాలు కాదిప్పుడు జూ.ఎన్టీఆర్‌కి కావాల్సింది. ‘బృందావనం’ లాంటి సినిమా, పైగా ఫ్యామిలీ ఆడియన్స్‌ మెచ్చే సినిమా.. మాస్‌ని ఆకట్టుకునే సినిమా తగిలితేనే మళ్ళీ జూ.ఎన్టీఆర్‌ కెరీర్‌ గాడిన పడ్తుంది. వాస్తవానికి జూ.ఎన్టీఆర్‌ కెరీర్‌ ఇలా డైలమాలో పడిపోతుందని ఎవరూ ఊహించి వుండరేమో.

జూ.ఎన్టీఆర్‌ కూడా, తనకు సరిపడే కథ కోసం వెతుకుతున్నాడట. సూపర్‌ హిట్‌ కాదు, మినిమమ్‌ గ్యారంటీ సినిమా చేయడమెలా.? అంటూ సినీ పరిశ్రమలో తనకు అత్యంత ఆప్తులైనవారితో చర్చలు జరుపుతున్నాడట జూ.ఎన్టీఆర్‌. చేతిలో ఓ సినిమా వున్నా, అదేమవుతుందో అంచనా వేయలేకపోతున్నాడిప్పుడు.

‘బాద్‌షా’ సినిమా ఊపేసే కలెక్షన్లు సాధిస్తుందనుకుంటే అది కాస్తా బోల్తా కొట్టింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ వున్నా ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడంతోనే జూ.ఎన్టీఆర్‌ జాగ్రత్త పడి వుండాల్సింది. ఇప్పటికైనా జూ.ఎన్టీఆర్‌ ఆలోచనలో మార్పు వస్తే, ఎలాగూ మంచి నటుడు గనుక, మాస్‌ని మెప్పించగలడు గనుక, డాన్సుల్లో దిట్ట గనుక.. కెరీర్‌ దూసుకుపోవడం ఖాయమే.

మరి, జూ.ఎన్టీఆర్‌ ఆ దిశగా కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటాడా.?