అనుష్క రేంజ్‌ ఎంత.?

తెలుగు తెరపై భారీ వసూళ్ళు సాధించిన చిత్రాల్లో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథాంశంతో తెరకెక్కిన ‘రుద్రమదేవి’ కూడా చేరేందుకు అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. సినిమా ఎలా తెరకెక్కుతోంది.? అన్న విషయాలు పక్కన పెడితే, సినిమాపై క్రియేట్‌…

తెలుగు తెరపై భారీ వసూళ్ళు సాధించిన చిత్రాల్లో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథాంశంతో తెరకెక్కిన ‘రుద్రమదేవి’ కూడా చేరేందుకు అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. సినిమా ఎలా తెరకెక్కుతోంది.? అన్న విషయాలు పక్కన పెడితే, సినిమాపై క్రియేట్‌ అవుతున్న హైప్‌ మాత్రం అంతా ఇంతా కాదు.

ఆల్రెడీ ‘అరుంధతి’ సినిమాతో అందరికీ షాకిచ్చి వుంది గనుక, అనుష్క – రుద్రమదేవి సినిమాపై భారీ అంచనాలున్నాయి. వరుస ఫ్లాపులు ఇస్తున్నా గుణశేఖర్‌ టాలెంట్‌పై సినీ పరిశ్రమలో చాలామందికి నమ్మకం వుంది. అదే ‘రుద్రమదేవి’ సినిమా టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అవుతోంది.

యాభై కోట్ల బడ్జెట్‌తో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ త్వరలో బయటకు రానుంది. ఆ లుక్‌ వచ్చాక, సినిమాపై అంచనాలు రెట్టింపవుతాయని చిత్ర యూనిట్‌ నమ్ముతోంది. సినిమా అంచనాలకు తగ్గ విజయం సాధిస్తే అనుష్క రేంజ్‌ టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో పెరిగిపోతుంది.

అన్నట్టు, అనుష్క ప్రధాన పాత్రలో యాభై కోట్ల బడ్జెట్‌తో మరో సినిమా తెరకెక్కింది. అయితే ఇది తమిళంలో. తెలుగులో ఇదే సినిమా ‘వర్ణ’ పేరుతో విడుదల కానుంది. మొత్తమ్మీద వయసు మీద పడ్తున్నా, అనుష్క రేంజ్‌ ఇంకా ఇంకా పెరుగుతోందే తప్ప తగ్గడంలేదు.