హిట్ సినిమాలు చూసి `వాత` పెట్టుకోవడం ఎన్టీఆర్‌కి మామూలే! ఓ హిట్ దర్శకుడికి అవకాశం ఇచ్చి, హిట్ ఫార్ములాలోనే సినిమా తీస్తూ.. ఫ్లాప్స్‌ని ఎదుర్కొన్నాడు. సురేందర్‌రెడ్డి, మెహర్ రమేష్, శ్రీనువైట్ల, హరీష్ శంకర్… వీరంతా హిట్ కొట్టి, ఆ తరవాత ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకొన్నవాళ్లే.
అయితే ఎన్టీఆర్ నమ్మకం ఎప్పుడూ నిజం కాలేకపోయింది. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ అదే తప్పు చేస్తున్నాడు. అత్తారింటికి దారేది తరవాత.. త్రివిక్రమ్‌తో జత కట్టడానికి తహతహలాడుతున్నాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కథ కావాలా (అంటే అత్తారింటికి.. లాంటిదన్నమాట) అంటూ త్రివిక్రమ్‌కి సూచించాడంట.
త్రివిక్రమ్ ఇప్పుడు అల్లు అర్జున్‌తో సినిమా చేయడానికి ఆల్‌మోస్ట్ రెడీ అయిపోయాడు. బన్నీ సినిమా తరవాత.. పవన్ తో కోబలి చేయాలి. ఈ మధ్య విరామంలో ఎన్టీఆర్ సినిమా ఉండే అవకాశాలున్నాయి. అత్తారింటికి ఫార్ములా అయినా ఎన్టీఆర్‌ని కనికరిస్తుందా?