ఓ డీవీడీ..నాలుగు సినిమాలు

మన సినిమా జనాలకు కథలు ఆలోచించేంత తీరుబాటు వుండదు. ఎక్కడ కథ లేదా పాయింట్ దొరుకుతుందా  కొట్టేద్దామా అనే. మిగిలిన క్రియేటివిటీ అంతా మహా బాగా చూపిస్తారు. ఇటీవల ఓ కొరియన్ డీవీడీ ఒకటి…

మన సినిమా జనాలకు కథలు ఆలోచించేంత తీరుబాటు వుండదు. ఎక్కడ కథ లేదా పాయింట్ దొరుకుతుందా  కొట్టేద్దామా అనే. మిగిలిన క్రియేటివిటీ అంతా మహా బాగా చూపిస్తారు. ఇటీవల ఓ కొరియన్ డీవీడీ ఒకటి దొరికిందట. అనగనగా ఓ ఆత్మ..దాని కోర్కె తీర్చాలని  మరో బతికి వున్న వారి ప్రయత్నం. ఇదీ లైన్. వెంటనే చకచకా కథలు అల్లేసారు. సూర్య రాక్షసుడు సబ్జెక్ట్ ఇదే. అలాగే మరో ఇద్దరు కూడ ఇదే లైన్ లో అల్లేసుకున్నారు. 

అదలా వుంటే, నాగ్ కు కళ్యాణ్ అనే ఓ కొత్త దర్శకుడు కథ చెప్పాడు. అది కూడా ఇదే లైన్ కు దగ్గరగా వుందీ అని ఇప్పడు టాలీవుడ్ టాక్. రాక్షసుడు సినిమా వచ్చిన తరువాత చూస్తే, దానికీ దీనికి దగ్గర పోలికలు వుండడం గమనించి, నాగ్ ఇప్పుడు మళ్లీ రిపేర్లు చేయిస్తునట్లు టాక్ వినిపిస్తోంది. 

రిపేర్లు చేయిస్తున్నది వాస్తవం..ఇటీవల కొత్తగా సినిమాలకు మాటలు రాయడం ప్రారంభించి, మాంచి కథాబలం వున్న సినిమాలకు సరైన ఛాయిస్ అనిపించుకుంటున్న ఓ రచయిత ఇప్పుడు అదే పనిమీద వున్నారట. మరి ఈ రిపేర్లు కోరియన్ సినిమా గుర్తుకురాకుండా చేయడానికా? మరి దేనికో? చూడాలి మరి.