ఓ ‘ఆర్’ అయినా మారుద్దాం?

ఆర్ఆర్ఆర్ అంటే రైజ్..రివోల్డ్..రివెంజ్ అని ముందుగానే గ్రేట్ ఆంధ్ర టైటిల్ ను బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో కొన్ని  వెబ్ సైట్లు కూడా అర్జెంట్ గా ఆ వార్తను తమ వార్తగా రాసేసుకున్నారు.…

ఆర్ఆర్ఆర్ అంటే రైజ్..రివోల్డ్..రివెంజ్ అని ముందుగానే గ్రేట్ ఆంధ్ర టైటిల్ ను బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో కొన్ని  వెబ్ సైట్లు కూడా అర్జెంట్ గా ఆ వార్తను తమ వార్తగా రాసేసుకున్నారు. మరోపక్క సోషల్ మీడియాలో ఈ టైటిల్ ప్రచారంలోకి వెళ్లిపోయింది. చాలా మంది ఈ టైటిల్ మీద పెదవి విరుస్తున్నారు. 

దీంతో అర్జెంట్ టైటిల్ లో ఒక్క ఆర్ అయినా మార్చి, టైటిల్ లీక్ అవ్వలేదనే కలర్ తేవాలని చూస్తోంది రాజమౌళి టీమ్. రైజ్..రివోల్ట్..రివెంజ్ లో ఆఖరి పదం అయిన రివెంజ్ ను మారిస్తే బెటర్ అనే ఆలోచనలు సాగుతున్నాయి. ఎందుకంటే రైజ్..రివోల్ట్ అంటే బాగానే వుంది. రివెంజ్ అనగానే జనాలకు సినిమా రివెంజ్ డ్రామానా అన్న అనుమానం వచ్చేస్తుంది. మామూలు సినిమానే ఇది కూడా అనే ఫీల్ వచ్చేస్తుంది అనే ఫీడ్ బ్యాక్ వుందని తెలుస్తోంది. 

ఇప్పటికే ఈ ఆర్ఆర్ఆర్ కు సరిపడా బోలెడు టైటిళ్లు రాజమౌళి టీమ్ దగ్గర వున్నాయి. అందువల్ల ఆ చివరి ఆర్ ను మార్చడమా? అలాగే వుంచడమా అన్న ఆలోచనలు సాగుతున్నట్లు బోగట్టా.

21 రోజులు మొత్తం దేశమంతా లాక్ డౌన్