Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అక్టోబర్ 10 లేదా 17న నిశ్శబ్దం

అక్టోబర్ 10 లేదా 17న నిశ్శబ్దం

అనుష్క-మాధవన్ కాంబినేషన్ లో తయారై నిశ్ళబ్దం సినిమా ఓటిటి ఎంట్రీ కి మరిన్ని అడుగులు ముందుకు పడ్డాయి. ఈ సినిమాను అమెజాన్ ప్రయిమ్ కు ఇవ్వడానికి దాదాపు అంతా రంగం సిద్దం అయింది. అగ్రిమెంట్ జరగాల్సి వుంది. ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమాను అక్టోబర్ 10 లేదా 17న విడుదల చేయాలని అమెజాన్ ప్రయిమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా శుక్రవారం అర్థరాత్రి సినిమాను లోడ్ చేస్తారు. అంటే అక్టోబర్ 9 రాత్రి గానీ 17 రాత్రి గానీ నిశ్శబ్దం విడుదల వుండే అవకాశం వుంది. ఈ సినిమా విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. నిజానికి వి సినిమా కన్నా ముందే విడుదల కావాల్సింది. కానీ గ్రాఫిక్స్, సిజి వర్క్ పూర్తి కావడానికి కరోనా అడ్డం పడింది. మొత్తానికి ఆ వ్యవహారాలు అన్నీ పూర్తి చేసారు. 

అమెజాన్ పత్రినిధులు, అనుష్క, నిర్మాతలు అంతా ఫైనల్ కాపీ చూసుకున్నాక, డీల్ ఫైనల్ అయింది. ఇక అగ్రిమెంట్ మాత్రం పెండింగ్ వుంది. అగ్రిమెంట్ సైన్ తో పాటే డేట్ వచ్చే అవకాశం వుంది. అలాగే కొత్త ట్రయిలర్ కూడా విడుదల చేసే అవకాశం కూడా వుంది.

నా ప్రెస్ మీట్ కోసం జనం ఎదురుచూసేవారు

రాష్ట్రాన్ని పున‌ర్నిర్మించుకుంటున్నాం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?