ఒకే స‌మ‌యంలో రెండూ చేయ‌నంటున్న ప్రభుదేవా…

ద‌క్షిణాది డ్యాన్స్ మాస్టర్‌గా కెరీర్ ప్రారంభించి, న‌టుడిగా, హీరోగా రాణించి… ప్ర‌స్తుతం బాలీవుడ్ డైరెక్టర్‌గా స‌క్సెస్ ఫుల్‌గా కొన‌సాగుతున్న ప్రభుదేవా… అక్కడి స్టార్స్‌తో సినిమాలు తీస్తున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్‌లో ప్రవేశించిన తొలినాళ్లలో కొన్ని…

ద‌క్షిణాది డ్యాన్స్ మాస్టర్‌గా కెరీర్ ప్రారంభించి, న‌టుడిగా, హీరోగా రాణించి… ప్ర‌స్తుతం బాలీవుడ్ డైరెక్టర్‌గా స‌క్సెస్ ఫుల్‌గా కొన‌సాగుతున్న ప్రభుదేవా… అక్కడి స్టార్స్‌తో సినిమాలు తీస్తున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్‌లో ప్రవేశించిన తొలినాళ్లలో కొన్ని సినిమాల‌కు కొరియోగ్రాఫ‌ర్‌గానూ ప‌నిచేసిన ప్రభుదేవా ప్రస్తుతం తాను డైరెక్టర్‌గా ప‌నిచేస్తున్న సినిమాల‌కు డ్యాన్స్ డైరెక్షన్ మాత్రం వేరే వాళ్లకి ఇచ్చేస్తున్నాడు. 

బ‌హుశా భార‌త‌దేశంలోనే టాప్ డ్యాన్సర్‌ల‌లో ఒక‌రైన ప్రభుదేవా… త‌న ద‌ర్శక‌త్వంలో వ‌స్తున్న సినిమాలో డ్యాన్స్‌లు నిర్ణయించే అవ‌కాశం వేరే వాళ్లకు ఇవ్వడ‌మేమిటి? ఈ ప్రశ్ననే అత‌ని ముందు ఉంచితే… ఒకే స‌మ‌యంలో రెండు ప‌నులు చేయడం త‌న‌కు ఇష్టం ఉండ‌ద‌ని చెప్పాడు. ఒక ప‌నిలో 100శాతం క‌మిట్మెంట్ చూపించాలంటే.. ఒక స‌మ‌యంలో ఒకే ప‌ని చేయాల‌నేది త‌న ఉద్ధేశ్యమ‌న్నాడు.

ప్రస్తుతం అక్షయ్‌కుమార్ హీరోగా న‌టిస్తున్న సింగ్ ఈజ్ బ్లింగ్ అనే సినిమాకు ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ప్రభుదేవా… ఈ సినిమాలో కూడా కొరియోగ్రఫీ వేరేవాళ్లకు అప్పగించాడు. ద‌క్షిణాది నుంచి వెళ్లి ఉత్తరాది మెచ్చేలాంటి సినిమాను పంజాబీ నేప‌ధ్యంలో తీయ‌డ‌మంటే మాట‌లు కాద‌ని, ఈ రేంజ్ క‌మిట్‌మెంట్ ఉండాల్సిందేన‌ని బాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు.