బాలీవుడ్ లో ఇప్పుడు బ్రేకప్ సీజన్ నడుస్తున్నట్టుంది. పెళ్లయిన సెలబ్రిటీలు విడిపోతున్నారు. పెళ్లి చేసుకుంటారేమో అనుకుంటున్న ప్రేమ జంటలు కూడా విడిపోతున్నాయి. తాజాగా ఈ బ్రేకప్ లిస్ట్ లోకి దీపిక, రణ్వీర్ సింగ్ కూడా చేరిపోయారు. దాదాపు నాలుగేళ్లుగా కలిసుంటున్న ఈ జంట, పద్మావతి సినిమాతో విడిపోయినట్టు వార్తలు వస్తున్నాయి.
పద్మావతి మూవీలో దీపిక, రణ్వీర్ నటించారు. తాజాగా ఈ సినిమా త్రీడీ ట్రయిలర్ లాంచ్ అయింది. ఈ ఈవెంట్ కు దీపిక మాత్రమే హాజరైంది. రణ్వీర్ సింగ్, మరో నటుడు షాహిద్ కూడా రాలేదు. షాహిద్ ను పక్కనపెడితే.. రణ్వీర్ సింగ్ వస్తే తను రానని యూనిట్ కు చెప్పేసిందట దీపిక. అందుకే యూనిట్ సభ్యులు ఈ ట్రయిలర్ లాంచ్ కు హీరోహీరోయిన్లు ఎవర్నీ ఆహ్వానించలేదు.
అయితే రణ్వీర్ సింగ్ రాలేదని తెలుసుకున్న దీపిక, ఆఖరి నిమిషంలో ఈవెంట్ కు హాజరైంది. అదే టైమ్ లో రణ్వీర్ సింగ్ స్నేహితులతో ఫుట్ బాల్ ఆడుకుంటున్నాడు. పిలిస్తే తప్పకుండా వస్తాడు. కానీ దీపిక కావాలనే రణ్వీర్ ను సైడ్ చేయించినట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి.
మొన్నటికిమొన్న రణబీర్, కత్రిన కూడా ఇలానే ఎడమొహం-పెడమొహంగా ఉంటూ ప్రమోషన్ చేశారు. ఒకే వేదికపై కూర్చున్నా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సున్నా. జగ్గాజాసూస్ ఫ్లాప్ కు అది కూడా ఓ కారణమైంది. ఇప్పుడు రణ్వీర్-దీపిక బ్రేకప్, పద్మావతి సినిమాను దెబ్బతీస్తుందేమోనని యూనిట్ భయపడుతోంది.