వేలం వెర్రి ఓవర్ సీస్?

రాను రాను ఓవర్ సీస్.. ఓ వేలం వెర్రిగా తయారైంది. సినిమా ఆడుతుందా.. ఆడదా.. ఓవర్సీస్ జనాల అభిరుచి ఏమిటి? అక్కడ టికెట్ రేటు, టైమ్ స్పెండింగ్, ఇంట్రెస్ట్, ఇవన్నీ మరిచిపోతున్నారు. ఏ సినిమా…

రాను రాను ఓవర్ సీస్.. ఓ వేలం వెర్రిగా తయారైంది. సినిమా ఆడుతుందా.. ఆడదా.. ఓవర్సీస్ జనాల అభిరుచి ఏమిటి? అక్కడ టికెట్ రేటు, టైమ్ స్పెండింగ్, ఇంట్రెస్ట్, ఇవన్నీ మరిచిపోతున్నారు. ఏ సినిమా దొరుకుతుందా, కొనేసి విడుదల చేద్దామా అని చూస్తున్నారు. తమ కళ్ల ముందు కొన్ని సినిమాలు కోట్లు కొల్లగొడుతూ వుండడంతో, మనం కూడా సంపాదించేద్దామనే తప్ప, రిస్క్ ఏ మేరకు అన్నది చూడడం లేదు. 

నిన్నటికి నిన్న కుందనపు బొమ్మ అనే సినిమా జస్ట్ అయిదు లక్షలకు కొన్నారు. 19 సెంటర్లలో ప్రీమియర్లు, రెగ్యులర్ షోలు 17 సెంటర్లలో వేసారు. వచ్చిన ఆదాయం 28 వేలు. అది ఖర్చులకు కూడా చాలదు. అంటే పెట్టిన అయిదు కాక, అదనపు లాస్ అన్నమాట.  ఒక మనసు సినిమా సంగతీ ఇదే. పెట్టినదంతా పోయినట్లే అని తెలుస్తోంది.

ఇటీవల సంపూర్ణేష్ బాబు సినిమా కొబ్బరి మట్ట 30లక్షలకు కొన్నారట. యుఎస్ లో కొబ్బరిమట్ట లాంటి చిన్న సినిమాలు ఎంతమంది చూస్తారు? సంపూ కు యుఎస్ లో వున్న క్రేజ్ ఎంత అన్నది లెక్కలు వేసుకున్నారా అన్నది అనుమానం. ముఫై లక్షలు రావాలి అంటే కనీసం 90 లక్షల దాకా వసూళ్లు సాగించాలి. ఎందుకంటే యుఎస్ లో ఖర్చులుఎక్కువ. 60శాతం ఖర్చులే పోతాయి.

ఇలా చాలా సినిమాలు యుఎస్ బయ్యర్లను కుదేలు చేస్తున్నాయి. ఫీల్ గుడ్ మూవీలు, స్టార్ కాస్ట్ తో పాటు డైరక్టర్ వాల్యూ వున్న సినిమాలే అక్కడి జనాలు చూస్తున్నారు. అది కూడా సినిమా బాగుంది అని కచ్చితంగా తెలిస్తేనే. మరి ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు సినిమాలు కొని, దేశం కాని దేశంలో కష్టపడి సంపాదించిన డబ్బులు పాడు చేసుకుంటున్నారో అర్థం కాదు.