శాటిలైట్ కు అడ్డం పడిన సర్టిఫికెట్?

త్రిష కథానాయికగా రూపొందిన హర్రర్ సినిమా నాయకి. ఇది ద్విభాషా సినిమా. ట్రయలర్ లు, టీజర్లు మంచి ఆదరణ పొందాయి గిరిధర్ నిర్మించిన ఈ సినిమాకు గోవి దర్శకుడు. బిజినెస్ పూర్తి చేసుకుని జూలై…

త్రిష కథానాయికగా రూపొందిన హర్రర్ సినిమా నాయకి. ఇది ద్విభాషా సినిమా. ట్రయలర్ లు, టీజర్లు మంచి ఆదరణ పొందాయి గిరిధర్ నిర్మించిన ఈ సినిమాకు గోవి దర్శకుడు. బిజినెస్ పూర్తి చేసుకుని జూలై 8న విడుదలకు సిద్దమైంది. అంతా బాగానే వుంది. సెన్సారు కూడా అయిపోయింది. ఎ సర్టిఫికెట్ వచ్చింది..అదే పాపం ఈ సినిమాకు సమస్య అయిందని వినికిడి. 

సమస్య అంటే విడుదలకో, మరి దేనికో కాదు, కేవలం శాటిలైట్ కు. సినిమా సెన్సార్ కు ముందు జెమిని టీవీ వాళ్లు ఈ సినిమాను కొనడానికి ఓకె అన్నారు. రేటు కూడా మాట్లాడేసుకున్నారు. తీరా ఏ సర్టిఫికెట్ రాగానే, సారీ అన్నారని వినికిడి. అలా వెనక్కు వెళ్లడంతో ఇప్పుడు మరో చానెల్ ను ట్రయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈలోగా వీడియో సెన్సార్ అని, కేవలం చానెల్ లో ప్రదర్శించేందుకు వీలుగా సెన్సారు చేయాలని, యు/ఎ ఇవ్వాలని ప్రయత్నాలు ప్రారంభించినట్లు వినికిడి. కానీ దానికి సెన్సారు వాళ్లు ఓకె అనడం లేదట. శాటిలైట్ ఇన్ కమ్ అంటే సినిమా ఏమాత్రం బాగున్నా, మూడు కోట్లవరకు వుంటుంది. ఈ ఎ సర్టిఫికెట్ అంత ఆదాయానికి అడ్డం పడిందన్నమాట.