'యాంగ్రీ యంగ్‌మెన్'గా తెలుగు తెరపై ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరో రాజశేఖర్, గత కొంతకాలంగా ఎలాంటి సినిమాలు చేయాలో తెలియక కన్‌ఫ్యూజన్‌లో పడిపోయాడు. చిరంజీవి సినిమాల్లో రీ-ఎంట్రీ ఇస్తే, అందులో విలన్‌గా నటించాలని వుందంటూ చాలా సందర్భాల్లో రాజశేఖర్ చెప్పాడు కూడా. రాజకీయ వైరం పక్కన పెట్టి, రాజశేఖర్ తన మనసులో మాట బయటపెట్టినా, ఆయన కోరిక నెరవేరలేదు.
చిరంజీవి కాకపోతే, ఇంకొకరు.. విలన్‌గా అవకాశాలు దక్కించుకోవడం ముఖ్యమని భావించాడో ఏమో, విలన్ పాత్రలకు 'సై' అనేశాడు రాజశేఖర్. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమా కోసం రాజశేఖర్ విలన్‌గా బుక్కయినట్లు తెలుస్తోంది. ఇక, తాజాగా ప్రవీణ్ సత్తారు అనే యంగ్ డైరెక్టర్, రాజశేఖర్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కించనున్నాడట. విలక్షణ చిత్రాలు, అదీ చిన్న చిత్రాలు తీసే ప్రవీణ్ సత్తారు, పోలీస్ గెటప్‌లో రాజశేఖర్‌ని ఎలా చూపించనున్నాడో ఏమో.!
మరోపక్క, రాజశేఖర్ తన శ్రీమతి జీవిత నిర్మాతగా ఓ సినిమా చేయబోతున్నాడట. ఈసారి జీవిత, దర్శకత్వం వైపు అస్సలేమాత్రం చూడకుండా కేవలం నిర్మాణ బాధ్యతలు మాత్రమే ఆమెకు అప్పగించి, దర్శకుడికి పూర్తి ఫ్రీడమ్ ఇవ్వాలని రాజశేఖర్ డిసైడ్ అయ్యాడట. పోలీస్ గెటప్‌లా కాకుండా, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చెయ్యాలన్నది రాజశేఖర్ ఆలోచన. దర్శకుడిగా ఒకటి రెండు హిట్లు కొట్టిన ఆ డైరెక్టర్, ఈ మధ్య సినిమాల్లేక ఖాళీగా వుంటున్నాడనీ, అతనితో రాజశేఖర్ సినిమాకి ఓకే చేశాడనీ టాలీవుడ్ సర్కిల్స్‌లో గుసగుసలు విన్పిస్తున్నాయి.
మొత్తమ్మీద ఓ పక్క హీరోగా వచ్చే ఆశకాశాలపై ఆశలు వదిలేసుకున్న టైమ్‌లో రాజశేఖర్‌కి మళ్ళీ అలాంటి ఛాన్సులు వస్తున్నాయన్నమాట. కాదు కాదు, కల్పించుకుంటున్నాడన్నమాట. అదే సమయంలో, విలన్ అవకాశాల్నీ వదులుకోవడానికి ఇష్టపడ్డంలేదు. చూద్దాం, రాజశేఖర్‌కి ఈసారి హిట్టిచ్చేది హీరోనా? విలనా.?