విష్ణు..డైనమైట్… అఖిల్.. అఖిల్.. రామ్ చరణ్.. బ్రూస్ లీ తరువాత మళ్లీ ఓవర్ సీస్ లో భారీ డిజాస్టర్ గా శంకరాభరణం మిగిలింది. అయితే వాటి రేట్లతో చూసుకుంటే శంకరాభరణం తక్కవే. యాభై లక్షలకు కొనుక్కున్నారు. ఎనభైకి పైగా మళ్లీ అక్కడ విడివిడిగా అమ్మేసుకున్నారు. అందువల్ల తొలి బయ్యర్ సేఫ్. కానీ చిన్న చిన్న ఏరియాలో కొనుకున్న మిగిలిన వారంతా మటాష్.
తొలి రోజు కేవలం 10వేల డాలర్లు వచ్చాయి వసూళ్లు. ఓవర్ సీస్ లో ఖర్చులు, ఈ వసూళ్లు చూసుకుంటే, ఏ రేంజ్ లో చేతికి తగుల్తుందో అర్థమవుతుంది. విష్ణు డైనమైట్ ఓన్ రిలీజ్..చేతికి ముఫై నుంచి యాభై లక్షల వరకు తగిలిందని వినికిడి. అఖిల్ ఏకంగా నాలుగు కోట్లకు పైగానే లాస్. చిత్రమేమిటంటే, అటు ఓవర్ సీస్ కొనే జనాలు కానీ, ఇటు ఇక్కడ సినిమా జనాలు కానీ అక్కడి ప్రేక్షకుల అభిరుచిని పట్టించుకోవడం లేదు.
క్లాస్ కామెడీ, ఫీల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లకే అక్కడ పెద్ద పీట వేస్తున్నారు. అది పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా సరే అక్కడి ప్రేక్షకులకు అనవసరం..బాగుందా లేదా అన్నది మాత్రమే పాయింట్. కానీ మనవాళ్లు..అక్కడ చించేస్తుంది..పొడిచేస్తుంది అనుకుంటూ ముందు వెనుక చూసుకోకుండా వెళ్లి బోల్తాపడుతున్నారు. అక్కడ కొనేవాళ్లు అలాగే వేలం వెర్రిగా కొంటున్నారు.