మన టాలీవుడ జనాలకు వాళ్లు నటించే సినిమాల మాదరిగానే హడావుడి ఎక్కువ…అసలు తక్కువ. మా అంటే తెలుగు నటీనటుల సంఘం..దీని తరపున ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. లైవ్ కూడా ఏర్పాటుచేసుకోండని చానెళ్లకు సూచించారు. అబ్బో..ఇదేందో..కాస్త గట్టిగా వుండేటట్టే వుందే..చెన్నయ్ కోసం మన మా జనాలు భారీగా ఏదో చేసేటట్లున్నారే అనుకున్నారంతా. అలాగే మన హీరోలంతా మైకుల ముందుకు వస్తారు అనుకున్నారు. తీరా చేసి ఏనుగు సామెతగా మిగిలింది. వచ్చింది రాజేంద్రప్రసాద్ మరొకరు. ప్రకటించింది అయిదు లక్షల విరాళం..అదీ సంగతి.
మరోపక్క మంచు లక్ష్మి, రానా, మనోజ్, నరేష్, నవదీప్, నాని, మధుశాలిని, శిరీష్ ఇంకా ఇలాంటి నటులంతా కలిసి, రాజధానిలోని మాల్స్ దగ్గర జోలె పడతారట. అంటే వీళ్ల జేబుల్లోంచి తీయరు. జనాల్ని తీయమంటారు. ఇలాంటి వాళ్లంతా లారెన్స్ లాంటి డ్యాన్స్ డైరక్టర్ ను చూసి నేర్చుకోవాలి. కోటి రూపాయిలు ఇచ్చాడు అతగాడు.మళ్లీ తాతల మూతుల నేతులు వాసన చూడమనే టైపు మన స్టార్లంతా..వంశాలు..వారసత్వాలు..వగైరా..దానగుణం మాత్రం..జనాల నుంచి రాబట్టేందుకే తప్ప మరెందుకు కాదు.