అఖిల్ సినిమాతో తెరపైకి హీరోగా వచ్చాడు అఖిల్. ఆశించిన మేరకు సక్సెస్ రాలేదు. ఇప్పడిపుడే ఆ షాక్ నుంచి బయటకు వచ్చాడు. సో. తరువాతి పాజెక్టు దిశగా ఆలోచన ప్రారంభమైంది. ఈ మేరకు నాగ్, అఖిల్ చర్యలు తీసుకోవడం ప్రారంభించారని వినికిడి.
ఒకరిద్దరు నిర్మాతలు ఇప్పటికే అఖిల్ ను అప్రోచ్ అయినట్ల తెలుస్తోంది. వీరు పనిలో పనిగా నాగ్ ను కూడా కలిసారని, సరైన కథ, డైరక్టర్ కాంబినేషన్ సెట్ అయితే అప్పుడు, అలాగే ముందుకు వెళ్దామని నాగ్ ఆ నిర్మాతలకు బేసిక్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే అఖిల్ కు సరిపడా డైరక్టర్ ఎవరూ ఇప్పుడు రెడీగా లేకపోవడం అన్నదే పెద్ద సమస్య గా వుంది. ఖాళీగా వున్న డైరక్టర్లపై వాళ్ల దృష్టి లేదు.
శేఖర్ కమ్ముల, క్రిష్, దేవకట్టా, ఇలా చాలా మందే రెడీగా వున్నారు. వీళ్లంతా ఒకప్పుడు మంచి సినిమాలు తీసినవారే.కానీ ఇప్పుడు అఖిల్ కు కావాల్సింది మంచి సినిమా కాదు..బ్లాక్ బస్టర్. మరి ఏ డైరక్టర్ సెట్ అవుతాడో చూడాలి.