సైజ్ జీరో 15 కోట్లు నష్టం?

పివిపి సంస్థ చాలా ఇష్టంగా జనం ముందుకు తీసుకు వచ్చిన సినిమా సైజ్ జీరో.  అనుష్కతో..ఓ మంచి మెసేజ్ తో అందించిన సినిమా ఇది. కానీ బ్యడ్ లక్ మిస్ ఫైర్ అయింది. కథకుకురాలు…

పివిపి సంస్థ చాలా ఇష్టంగా జనం ముందుకు తీసుకు వచ్చిన సినిమా సైజ్ జీరో.  అనుష్కతో..ఓ మంచి మెసేజ్ తో అందించిన సినిమా ఇది. కానీ బ్యడ్ లక్ మిస్ ఫైర్ అయింది. కథకుకురాలు కనిక, దర్శకుడు ప్రకాష్ సినిమాను రాంగ్ రూట్లో నడిపించడంతో జనం ఆ దారిలోకి రాలేదు. ఈ సినిమాకు ఇంకా శాటిలైట్ కూడా కాలేదు. పైగా పివిపి సంస్థ నేరుగా విడుదల చేసుకుంటుంది ఓవర్ సీస్ తో సహా అన్ని చోట్లా. దీని వల్ల చాలా పెద్ద మొత్తంలోనే నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. దగ్గర దగ్గర 15 కోట్లకుపైగానే లాస్ వుంటుందని ఇండస్ట్రీ అంచనా? 

అయితే చిత్రంగా ఇండస్ట్రీలో..పివిపి సంస్థకు ఇదేమంత పెద్ద మొత్తం కాదనే మాటలు వినిపిస్తున్నాయి. పివిపి ఫైనాన్స్ చేసిన సినిమాలు, నిర్మాతల నుంచి భారీగా వడ్డీలే వసూలు అయ్యాయని, అందులో 15 కోట్ల ఏ మూలకు అని కామెంట్ లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లోని ఓ పెద్ద బ్యానర్ నిర్మాతే..తన సినిమాల కోసం పివిపి కి అయిదు కోట్ల వరకు వడ్డీ పీవీపీ సంస్థకు కట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ఓ నటుడికి చెందిన సంస్థకు కూడా కోట్లలో వడ్డీ కట్టినట్లు తెలుస్తోంది. 

ఇలాంటి రెండు మూడు ఖాతాల వడ్డీలే ఈజీగా పది నుంచి పదిహేను కోట్లు వంటాయని, అందువల్ల సైజ్ జీరో నష్టం పీవీపీ కి ఓ లెక్కలోది కాదని ఇండస్ట్రీలో కామెంట్ లు వినిపిస్తున్నాయి. కానీ ఎటొచ్చీ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ కు మాత్రం మళ్లీ ఎవరు సినిమా ఇస్తారో చూడాలి..నాగార్జున ఆదుకుంటాడా? ఏమో?