తన జానర్ నుంచి బయటకు వచ్చి, దర్శకుడు మారుతి చేస్తున్న సినిమా ప్రతి రోజూ పండగే. హీరో సాయితేజ్ చాలా ఆశలు పెట్టుకున్న సినిమా. ఈ సినిమాకు సంబంధించి రెండు పాటలు విడుదల చేసారు. ఓ బావా అన్న పాట జనాల్లోకి బాగానే వెళ్లింది.
సినిమాకు మంచి బజ్ మెల్లగా వస్తోంది. ఇలాంటి టైమ్ లో విడుదల డేట్ దృష్ట్యా చూస్తుంటే ఆ సినిమా అన్ని విధాలా కార్నర్ అవుతుందేమో అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.
ప్రతి రోజూపండగే సినిమా డిసెంబర్ 20న విడుదల అవుతోంది.దాంతో పాటు దబాంగ్ 3, బాలకృష్ణ రూలర్ సినిమాలు కూడా వస్తున్నాయి. రూలర్ కు, పండగకు పోలిక లేకపోయినా, మాస్ ఫిలిం గా, బాలయ్య సినిమాగా బి సి సెంటర్లలో ప్రతి రోజూ పండగే సినిమా ఓపెనింగ్స్ ను అయితే ప్రభావితం చేస్తుంది. ఇది కచ్చితంగా జరిగే పరిణామం. అలాగే మల్టీ ఫ్లెక్స్ ల్లో దబాంగ్ 3 కూడా కాస్త సమస్యే అవుతుంది.
సినిమా విడుదలయిన తరువాత ఏ సినిమా బాగుంటుంది అన్నదాని మీద ఆధారపడి వుంటాయి శని, ఆదివారం కలెక్షన్లు ఆధారపడి వుంటాయి. కానీ వెంకీమామ సినిమా కనుక 25 కు విడుదలయితే మళ్లీ కొత్త తలనొప్పి వస్తుంది. ఎలా లేదన్నా క్రిస్మస్ పండగ కలెక్షన్లు ఆ సినిమాతో షేర్ చేసుకోవాల్సి వస్తుంది.
అయితే ప్రతి రోజూ పండగే సినిమా బడ్జెట్ చాలా తక్కువ. పైగా పెట్టిన పెట్టుబడి నాన్ థియేటర్ రూపంలో రికవరీ అయిపోయింది. అందువల్ల లాభ నష్టాల రీత్యా పెద్దగా సమస్య రాకపోవచ్చు. సినిమా హిట్ రన్ టాక్ తెచ్చుుకుంటే చాలు. లేదూ అంటే ఇన్ని సినిమాల మధ్య నలిగిపోయే ప్రమాదం వుంది.