పండగ చేసుకుంటున్న ‘బుల్లోడు’

‘భీమవరం బుల్లోడు’ చిత్రానికి రేటింగ్స్‌ సరిగా రాలేదు. సినిమా టాక్‌ కూడా ఏమంత బాలేదు. కానీ అవేమీ ఈ చిత్రం జోరుని ఆపడం లేదు. శివరాత్రి రోజు రిలీజ్‌ అయిన ఈ చిత్రం మొదటి…

‘భీమవరం బుల్లోడు’ చిత్రానికి రేటింగ్స్‌ సరిగా రాలేదు. సినిమా టాక్‌ కూడా ఏమంత బాలేదు. కానీ అవేమీ ఈ చిత్రం జోరుని ఆపడం లేదు. శివరాత్రి రోజు రిలీజ్‌ అయిన ఈ చిత్రం మొదటి రోజే సూపర్‌ కలెక్షన్స్‌ తెచ్చుకుంది. రెండు, మూడు రోజుల్లో కూడా దీనికి కలెక్షన్స్‌ బ్రహ్మాండంగా వచ్చాయి. ఇక ఆదివారం వసూళ్లు ఎలాగో బాగుంటాయి. 

మొదటి వారాంతానికే ఈ చిత్రం ఏడు కోట్లకి పైగా షేర్‌ రాబట్టుకుంటుందని అంచనా. ఎవడు తర్వాత రిలీజ్‌ అయిన సినిమాల్లో హార్ట్‌ ఎటాక్‌ మంచి ఓపెనింగ్స్‌ తెచ్చుకుంది. ‘భీమవరం బుల్లోడు’కి దానికంటే బెటర్‌ ఓపెనింగ్స్‌ వచ్చాయి. తక్కువ బడ్జెట్‌లో రూపొందిన ఈ చిత్రం త్వరలోనే సేఫ్‌ జోన్‌లోకి ఎంటర్‌ అవుతుందని టాక్‌ వినిపిస్తోంది. 

సురేష్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని చాలా ఏరియాల్లో సురేష్‌ మూవీస్‌ ద్వారానే రిలీజ్‌ చేసారు. వీక్‌ డేస్‌లో కలెక్షన్స్‌ ఘోరంగా పడిపోకపోతే కనుక ‘భీమవరం బుల్లోడు’ ఈజీగా సేఫ్‌ వెంఛర్‌ అవుతుంది. ఇంతకుముందే సునీల్‌కి బిజినెస్‌ సర్కిల్స్‌లో మంచి క్రేజ్‌ ఉంది. మాస్‌లో అతనికి ఉన్న క్రేజ్‌ ఈ చిత్రంతో ఇంకోసారి రుజువైంది కనుక సునీల్‌ రాబోయే చిత్రాలకి ఇది పెద్ద అడ్వాంటేజ్‌ అవుతుంది.