ఈమధ్య పవన్‌కళ్యాణ్ ఏ పబ్లిక్ వేడుకకి వచ్చినా కానీ వెనకాలే త్రివిక్రమ్ కూడా తయారవుతున్నాడనేది గమనించే ఉంటారు. చావు పరామర్శకైనా, ఏదైనా వేడుకలో పాల్పంచుకునేందుకు అయినా, ఛారిటీ ఈవెంట్ అయినా కానీ పవన్‌తో పాటు త్రివిక్రమ్ ఉండాల్సిందే. ఇవ్వక ఇవ్వక ఇంటర్వ్యూ ఇచ్చినా కానీ పక్కనే త్రివిక్రమ్‌ని కూర్చోబెట్టుకున్నాడు పవన్.
అంతే కాదు… పవన్‌కళ్యాణ్‌కి ఎవరు చెప్పే కథనైనా త్రివిక్రమ్ అప్రూవ్ చేయాలట. గబ్బర్‌సింగ్ 2 కథ అన్నిసార్లు మారడానికి కూడా త్రివిక్రమ్‌కి నచ్చకపోవడమే కారణమట. పవన్ తీసుకునే ఏ డెసిషన్ అయినా కానీ త్రివిక్రమ్‌తో చర్చించిన తర్వాత తీసుకుంటున్నాడట. గతంలో పవన్‌కి కొంతమంది ఆంతరంగికులు ఉండేవారు.
మెగా ఫ్యామిలీలో అందరికీ తెలిసిన వారే పవన్ దగ్గరా సలహాదారులుగా, అతని పియ్యేలుగా ఉండేవారు. కానీ ఇప్పుడు వారెవరూ అక్కడ లేరు. పవన్ అంటే త్రివిక్రమ్… త్రివిక్రమ్ అంటే పవన్ అన్నంతగా ఇద్దరి మధ్య స్నేహబంధం పెరిగిపోయింది. ఈమధ్య పవన్ పబ్లిక్ ఫంక్షన్స్‌లో ఎక్కువగా కనిపించడానికి కూడా త్రివిక్రమ్ ప్రోద్బలమే కారణమని వినిపిస్తోంది. వరుసగా తామిద్దరే సినిమాలు చేసే అవకాశమున్నా కానీ అలా వద్దని మధ్యమధ్యలో వేరే చిత్రాలు కూడా చేస్తున్నారట. ఇదంతా వింటుంటే ఇదెంత గాఢ స్నేహమో అనిపిస్తోంది కదూ.