పవర్‌స్టార్‌ రూట్లో నాగబాబు కొడుకు?

కథల ఎంపికలో రామ్‌ చరణ్‌ అచ్చంగా తన తండ్రిని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటున్నాడు. చిరంజీవి తన కెరీర్‌లో ఎక్కువగా చేసినవి మాస్‌ మసాలా సినిమాలే కాగా, చరణ్‌ కూడా అలానే మాస్‌ చిత్రాలు ఎక్కువగా చేస్తున్నాడు.…

కథల ఎంపికలో రామ్‌ చరణ్‌ అచ్చంగా తన తండ్రిని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటున్నాడు. చిరంజీవి తన కెరీర్‌లో ఎక్కువగా చేసినవి మాస్‌ మసాలా సినిమాలే కాగా, చరణ్‌ కూడా అలానే మాస్‌ చిత్రాలు ఎక్కువగా చేస్తున్నాడు. చిరంజీవితో సంబంధం లేకుండా తన కెరీర్‌ నిర్మించుకున్నాడు పవన్‌కళ్యాణ్‌.

అన్నయ్య నీడ నుంచి త్వరగా బయటపడి లవ్‌స్టోరీస్‌ చేసి యూత్‌కి దగ్గరయ్యాడు. సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, ఖుషీలాంటి చిత్రాలు పవన్‌కి యూత్‌లో తిరుగులేని ఫాలోయింగ్‌ తెచ్చాయి. చరణ్‌ ఎందుకో బాబాయ్‌ రూట్లోకి వెళ్లడానికి జంకుతున్నాడు. కానీ నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ మాత్రం పవన్‌ రూట్లో సాగడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. 

మాస్‌ సినిమాలతో మెప్పించడం ఈజీ అయినా కానీ కొంతకాలం తర్వాత కథల కోసం చాలా ఇబ్బంది పడాలి. అదే ప్రేమకథలు, యూత్‌ఫుల్‌ సినిమాలు చేస్తూ వెళితే మాస్‌ చిత్రాలు చేసుకోవడానికి తర్వాత స్కోప్‌ ఉంటుంది. పవన్‌ తన కెరీర్‌నే ఇలాగే బిల్డ్‌ చేసుకుని ఇప్పుడు ఆల్‌మోస్ట్‌ నంబర్‌వన్‌ పొజిషన్‌కి చేరుకున్నాడు. లుక్స్‌తోనే మార్కులు కొట్టేసిన వరుణ్‌ తేజ్‌కి కెరీర్‌ ప్లానింగ్‌లోను క్లారిటీ బాగానే ఉన్నట్టుంది.