మామూలుగానే నటుడి సీన్లు సినిమాల్లో ఎడిటింగ్ కు గురైపోతే బాధగా వుంటుంది. మంచి సీన్లు లేపేసారు అని లోలోపల బాధపడతారు.
అలాంటి కీలకమైన సినిమాలో, తమ కెరీర్ కు హెల్ప్ అవుతుందనుకున్న సినిమాలో ఇలా జరిగితే మరీ బాధగా వుంటుంది.
జబర్దస్త్ లో మంచి కమెడియన్ గా పేరు గెటప్ శ్రీను కు ఇలాంటి అనుభవమే ఎదురయిందని గ్యాసిప్ వినిపిస్తోంది.
ఆచార్య సినిమా కోసం గెటప్ శ్రీను కాస్త ఎక్కువ రోజులే పని చేసాడని తెలుస్తోంది. మాంచి కామెడీ ట్రాక్ రన్ చేసారు. కానీ మరి ఏమయిందో ఫైనల్ ఎడిట్ లో ఎంటర్ టైన్ మెంట్ పార్ట్ లేచిపోయిందని బోగట్టా.
బహుశా కాజల్ కాంబినేషన్ కామెడీ సీన్లు కావచ్చు. లేదా సీరియస్ సినిమాలో ఫన్ ప్రొపర్ గా మిక్స్ కావడం లేదని కావచ్చు. మొత్తానికి సీన్లు లేపేసారని టాక్ వినిపిస్తోంది.
మెగాస్టార్ సినిమాలో క్యారెక్టర్ అంటేనే ఉత్సాహం ఒక రేంజ్ లో వుంటుంది. అవి తీసేసారని తెలిస్తే బాధ కూడా ఆ రేంజ్ లోనే వుంటుందేమో?