పాపం.. సుధీర్ బాబు

కథలు మన దగ్గరకు వచ్చినపుడు దాని వాల్యూ పసిగట్టగలగాలి. డైరక్టర్ స్టామినా అంచనా వేయగలగాలి. అలా చేయలేకపోతే, మంచి ప్రాజెక్టు చేజారిపోవచ్చు.. చెత్త ప్రాజెక్టులు చేతిలోకి రావచ్చు. సుధీర్ బాబు పాపం ఇప్పుడు ఇలాగే…

కథలు మన దగ్గరకు వచ్చినపుడు దాని వాల్యూ పసిగట్టగలగాలి. డైరక్టర్ స్టామినా అంచనా వేయగలగాలి. అలా చేయలేకపోతే, మంచి ప్రాజెక్టు చేజారిపోవచ్చు.. చెత్త ప్రాజెక్టులు చేతిలోకి రావచ్చు. సుధీర్ బాబు పాపం ఇప్పుడు ఇలాగే ఫీలవుతూ వుండి వుండాలి. ఎందుకంటే ఓ సూపర్ హిట్ సినిమా ఆయన చేజారిపోయింది. ఆ సినిమానే ఆర్ ఎక్స్ 100.

ఆర్ ఎక్స్ 100 ఏరేంజ్ హిట్ నో ఇప్పుడు కొత్తగా చెప్పనక్కరలేదు. ఫస్ట్ వీకెండ్ లో అయిదుకోట్ల షేర్ రాబట్టిన సినిమా. నిర్మాణ వ్యయానికి డబుల్ అమౌంట్ ఫస్ట్ వీక్ లో రావడం అంటే అంత చిన్న విషయంకాదు. ఈ సినిమా డైరక్టర్ అజయ్ భూపతి, ఈ సబ్జెక్ట్ పట్టుకుని, హీరో సుధీర్ బాబు చుట్టూ దాదాపు మూడు నాలుగు నెలలు తిరిగినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆఖరికి వెనక్కు వచ్చేసి, వేరే ఒకరిద్దర్ని ట్రయ్ చేసి, ఆఖరికి మంచి సబ్జెక్ట్ కోసం ఎదురుచూస్తున్న కార్తికేయకు వినిపించాడు. అంతే ప్రాజెక్టు ఫైనల్ అయింది. తను పుట్టి పెరిగిన ఈస్ట్ గోదావరి ఆత్రేయపురం పరిసర ప్రాంతాల్లోనే మొత్తం షూట్ చేసి, రెండున్నర కోట్ల రేంజ్ లో ప్రొడక్ట్ ఫినిష్ చేసి ఇచ్చాడు. ఇదే సినిమా సుధీర్ బాబు ఓకె చేసుకుని, తన బ్యానర్ లో చేసుకుని వుంటే ఎలా వుండేదో?