Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వారాహిలో సినిమా చేస్తా..బన్నీ

వారాహిలో సినిమా చేస్తా..బన్నీ

సాధారణంగా బన్నీ ఎవరికీ మాట ఇవ్వడు. కానీ ఇస్తే మాత్రం నిలబెట్టుకుంటాడు. ఎప్పుడో అన్నమాట మేరకు లగడపాటి శ్రీధర్ ను పిలిచి మరీ సినిమా చేసాడు. అలాగే నల్లమలుపు బుజ్జికి ఇప్పుడు సినిమా చేయబోతున్నాడు. మరో నిర్మాతకు లేటెస్ట్ గా మాట ఇచ్చాడు. సరైన సబ్జెక్ట్ తెస్తే, ఆ బ్యానర్ లో సినిమా చేస్తాను అని. 

విజేత విజయోత్సవం సందర్భంగా జరిగిన సభకు అల్లుఅర్జున్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. కొత్తవాళ్లను ఎంకరేజ్ చేసే సాయి కొర్రపాటి అంటే ఇష్టం అని, ఎప్పటికైనా ఆ బ్యానర్ లో సినిమా చేస్తా అని వేదిక మీద ప్రకటించాడు. నిజానికి ఇది సాయి కొర్రపాటికి చాన్సే. ఎందుకంటే సరైన సబ్జెక్ట్, డైరక్టర్ కోసం వెదుకుతున్నాడు బన్నీ. ఆ లోటు కనుక పూడ్చగలిగితే బన్నీతో ఓ వందకోట్ల సినిమా చేసుకోవచ్చు.

నిజానికి స్టార్ హీరోలతో వారాహి సంస్థ సినిమా చేసి చాలాకాలం అయింది. అన్నీ చిన్న సినిమాలు, అందుబాటులో వున్న హీరోలతో చేస్తున్నారు. మంచి సినిమాలు అనిపించుకుంటున్నాయి కానీ, లాభాలు ఇవ్వడం లేదు. ఇలాంటి టైమ్ లో బన్నీ లాంటి హీరోతో, మాంచి డైరక్టర్ తో సినిమా చేయగలిగితే లాభాలు కళ్ల చూడొచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?