Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పరుశురామ్ .. తరువాత ఏంటీ?

పరుశురామ్ .. తరువాత ఏంటీ?

ఇప్పటిదాకా చేసిన సినిమాలు అన్నీ కాస్తో, కూస్తో బాగున్నవి, హిట్ సినిమాలే తప్ప, డిజాస్టర్లు అయితే లేవు డైరక్టర్ పరుశురామ్ ఖాతాలో. ఒక్క సారొచ్చారు సినిమా మాత్రమే తేడాకొట్టింది. అది కూడా మిస్ కాస్టింగ్ సమస్య అనుకోవాలి. సోలో, శ్రీరస్తు శుభమస్తు అన్నీ లాభాలు ఇచ్చిన సినిమాలే అయినా, తీసుకురావాల్సినంత పేరు మాత్రం తీసుకురాలేదు.

ఇప్పుడు గీతగోవిందం పెద్ద హిట్ అనిపించుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సినిమా విడుదల ముందు అంతా హీరో, హీరోయిన్ మీదనే నడిచింది సినిమా పబ్లిసిటీ. డైరక్టర్ అనేవాడు ఈసినిమాకు ఉన్నాడు అన్నది కూడా పెద్దగా పట్టించుకోలేదు.

కానీ ఇప్పుడు సినిమా చూసిన తరువాత హీరో పుల్లింగ్ తో పాటు డైరక్టర్ చాకచక్యం కూడా వుంది అని గుర్తింపు వచ్చింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి పరుశురామ్ మీదకు. అయితే మరి ముచ్చటగా మూడో సినిమా కూడా గీతాలో చేస్తాడా? పరుశురామ్ అన్నది అనుమానం. గీతాలో పరుశురామ్ సినిమా మరోటి వుందని అల్లు అరవింద్ అయితే ప్రకటించారు. బయట ఒక సినిమా చేసి వస్తాడా? లేక కంటిన్యూగా చేస్తాడా చూడాలి.

ఎందుకంటే సినిమా విడుదలకు ముందే ఈసారి గీతాక్యాంప్ లో కాకుండా వేరేవాళ్లకు సినిమా చేయాలని పరుశురామ్ ఆలోచిస్తున్నట్లు గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు గీతగోవిందం హిట్ తరువాత కూడా అదే వినిపిస్తోంది. ఇప్పటికే ఒకరిద్దరి హీరోల పేర్లు అప్పుడే వినిపించడం మొదలైంది. అలాంటి పేర్లలో హీరో రామ్ పేరు ఒకటి. రవితేజ పేరు కూడా వినిపిస్తోంది. వెయిట్ చేస్తే కానీతెలీదు.. పరుశురామ్ తరువాత ఏమిటో?

ఎవరితో అయినా, ఎప్పుడు అయినా, ఇప్పటికైనా పరుశురామ్ కు రావాల్సిన పేరు వచ్చింది అనుకోవాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?