Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సుధీర్ బాబుతో మెహరీన్

సుధీర్ బాబుతో మెహరీన్

ఈ మధ్య హీరో సుధీర్ బాబు స్పీడందుకున్నాడు. చకచకా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే నన్ను దోచుకుందువటే విడుదలకు రెడీగా వుంది. అదికాక మరో రెండు సినిమాలు చేతిలో వున్నాయి. ఇప్పుడు వీటికన్నా ముందుగా మరోటి స్టార్ట్ చేసేస్తున్నాడు. ఇప్పటికే చాలామంది హీరోలతో నటించిన మెహరీన్  కథానాయికగా ఓ సినిమా రేపు ఓపెనింగ్ కాబోతోంది.

శ్రీవిష్ణుతో సినిమా నిర్మించిన నిర్మాత రిజ్వాన్ మలి సినిమాను సుధీర్ బాబుతో ప్లాన్ చేస్తున్నారు. దీనికి పులివాసు డైరక్టర్. ఈ సినిమాకు మహుర్తం షాట్ కు రామానాయుడు స్టూడియోలో రేపు క్లాప్ కొడుతున్నారు. ఈ ఫంక్షన్ కు దిల్ రాజు, వివి వినాయక్, పరుచూరి గోపాలకృష్ణ వంటి హేమాహేమీలు అతిధులుగా హాజరవుతున్నారు.

సుధీర్ బాబుకు సరిపోయే కథ, కథనాలతో ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?