నానాటికీ జారిపోతోంది బిగ్ బాస్ సీజన్ 4. జబర్దస్త్, ఢీ, స్టార్ మహిళ లాంటి పాపులర్ షో ల మాదిరిగా కంటెస్టెంట్ చేత అడ్డమైన ఆటలు ఆడిస్తూ కాలం గడిపేస్తుంటే, అంతా నిరాసక్తంగా తయారైంది.
కనీసం నాగార్జున హోస్ట్ గా వచ్చిన రెండు రోజులు అయినా కాస్త బాగుంటుంది అనుకుంటే ఈ శనివారం కూడా చప్పగా ముగిసింది. రాబోయే అయిదువారాల షో ల రేటింగ్ ను నిలబెట్టేందుకు, ఈ ఆదివారం షో ను రక్తి కట్టించేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు మల్టీ టాలెంటెడ్ యాంకర్ సుమ ను రంగంలోకి దింపారు.
సుమను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రంగంలోకి దింపుతున్నట్లు ప్రోమో వదిలారు. నిజానికి ఇక నో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ గతంలో ఫీలర్లు వచ్చాయి. కానీ ఇప్పుడు డౌన్ అవుతున్న ట్రెండ్ ను చూసి సుమను ఒప్పంచినట్లు కనిపిస్తోంది.
అయితే సుమ మరీ అయిదువారాల పాటు బిగ్ బాస్ లో వుంటారా? అన్నది అనుమానమే. ఎందుకంటే ఆమెకు స్టార్ మహిళ, క్యాష్ లాంటి కార్యక్రమాలు, స్వంత యూ ట్యూబ్ చానెల్, ఓటిటి కార్యక్రమాలు ఇలా చాలా వున్నాయి.
అందువల్ల మహా అయితే ఒక వారం మాత్రమే వుంచుతారో లేక మరో వారం వరకు ఆపగలరో చూడాలి.