హ్యాట్రిక్ కు రెడీ అవుతున్న ఉప్పెన

కరోనా కారణంగా విడుదలకు దూరంగా వుండిపోయింది ఉప్పెన సినిమా. కానీ ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు టాప్ హిట్ అయిపోయాయి. నీ కన్ను నీలి సముద్రం, ధడ్..ధడ్ పాటలు మోస్ట్…

కరోనా కారణంగా విడుదలకు దూరంగా వుండిపోయింది ఉప్పెన సినిమా. కానీ ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు టాప్ హిట్ అయిపోయాయి. నీ కన్ను నీలి సముద్రం, ధడ్..ధడ్ పాటలు మోస్ట్ పాపులర్ అయిపోయాయి. ఇప్పుడు మూడో పాట ను విడుదల చేస్తున్నారు. 

రంగులద్దుకున్న తెల్లకాగితం అనే ఈ పాటను మహేష్ బాబు విడుదల చేయబోతున్నారు. సుకుమార్ తో కనెక్షన్ వుంటే చాలు దేవీశ్రీ పాటలు ఓ రేంజ్ లో వుంటాయి.

ఉప్పెన సినిమా దర్శకుడు సానా బుచ్చిబాబు సుకుమార్ శిష్యుడు. పైగా ఉప్పెన సినిమా నిర్మాణంలో సుకుమార్ రైటింగ్స్ సంస్థకు భాగస్వామ్యం వుంది.

మైత్రీ మూవీస్ నిర్మించిన ఈ సినిమాతో మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.  కాకినాడ సమీపంలోని ఉప్పాడ సముద్ర తీర గ్రామం నేపథ్యంలో నిర్మించిన ఉప్పెన సినిమా ఎప్పుడు విడుదలవుతుందన్నది మాత్రం ఇప్పటికి అయితే క్లారిటీ లేదు. థియేటర్లు పూర్తిగా, పూర్తి స్థాయిలో తెరుచుకుంటే తప్ప అది సాధ్యం కాదు.