మెహ్రీన్ ఇప్పుడెక్కడుంది.. ఏం చేస్తోంది?

తమన్న, శృతిహాసన్ లాంటి హీరోయిన్లు సెట్స్ పైకొచ్చేశారు. వీళ్లు మాత్రమే కాదు, దాదాపు టాలీవుడ్ లీడింగ్ హీరోయిన్లంతా మెల్లమెల్లగా సినిమాలు స్టార్ట్ చేశారు. అయితే ఈ గ్రూప్ లో మెహ్రీన్ మిస్సయింది. మరి ఆమె…

తమన్న, శృతిహాసన్ లాంటి హీరోయిన్లు సెట్స్ పైకొచ్చేశారు. వీళ్లు మాత్రమే కాదు, దాదాపు టాలీవుడ్ లీడింగ్ హీరోయిన్లంతా మెల్లమెల్లగా సినిమాలు స్టార్ట్ చేశారు. అయితే ఈ గ్రూప్ లో మెహ్రీన్ మిస్సయింది. మరి ఆమె ఇప్పుడు ఎక్కడుంది? ఏం చేస్తోంది?

లాక్ డౌన్ ఎప్పుడెప్పుడు ముగిసిపోతుందా అని ఎదురుచూసిన మెహ్రీన్, ఎంచక్కా మాల్దీవులు చెక్కేసింది. వారం రోజులుగా అక్కడే సేదతీరుతుంది. అంతేకాదు.. రీసెంట్ గా తన పుట్టినరోజును కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకుంది. మరి మెహ్రీన్ తో ఎవరున్నారు?

ఈ మధ్య తాప్సి కూడా మాల్దీవులు వెళ్లింది. సెడన్ గా అక్కడ ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో ప్రత్యక్షమైంది. తన లవ్ ఎఫైర్ ను అలా బయటపెట్టింది తాప్సి, అయితే మెహ్రీన్ మాత్రం అలాంటి పనులేం చేస్తున్నట్టు లేదు. 

బుద్ధిగా కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవులకు వెళ్లింది. నియమా దీవుల్లో తల్లి, సోదరుడితో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఆ ఫొటోల్ని ఎప్పటికప్పుడు ఆమె షేర్ చేస్తోంది కూడా.

లాక్ డౌన్ కు ముందు ఆమె అశ్వత్థామ అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఓ తెలుగు, తమిళ సినిమా ఉన్నాయి. వీటితో పాటు ఎఫ్-3లో కూడా తను నటించబోతున్నట్టు ప్రకటించింది. మాల్టీవుల నుంచి రిటర్న్ అయిన వెంటనే మళ్లీ సినిమాలతో బిజీ అవుతుంది ఈ ముద్దుగుమ్మ.

Click Here For Photo Gallery

నన్ను పార్టీనుంచి బైటకు పంపట్లేదు