cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పిల్లల కోసం ఇల్లు కొన్న పవన్?

పిల్లల కోసం ఇల్లు కొన్న పవన్?

సెలబ్రిటీ హోదాలో వుంటే గ్యాసిప్ లు వినిపిస్తూనే వుంటాయి. అందునా జనసేనాధిపతి, పవర్ స్టార్ కావడంతో జనాల దృష్టి పవన్ కళ్యాణ్ మీద సదా వుంటుంది. టాలీవుడ్ లో లేటెస్ట్ గా వినిపిస్తున్న గ్యాసిప్ ఏమిటంటే, పవన్ తన మలి భార్య (రెండోభార్య) పిల్లల కోసం ఓ ఫ్లాట్ కొన్నారన్నది. పవన్ రెండో భార్య రేణు దేశాయ్ ప్రస్తుతం హైదరాబాద్ షిప్ట్ అయ్యారని తెలుస్తోంది.

పిల్లలు పెద్దయ్యారు, వారి భవిష్యత్ ను తీర్చి దిద్దాల్సిన బాధ్యత వుంది. అందులో భాగంగా పిల్లలు తండ్రి పవన్ కు దగ్గరగా వుండాల్సిన అవసరం వుంది. అందుకే రేణు దేశాయ్ హైదరాబాద్ షిప్ట్ అయ్యారని టాక్. పవన్ కొడుకును ఎప్పటికైనా హీరోను చేయాలన్న కోరిక రేణు కు వుందని తెలుస్తోంది. 

ఇలా హైదరాబాద్ షిఫ్ట్ అయిన రేణు, ఆమె పిల్లల కోసం పవన్ నే ఓ ఫ్లాట్ ను కొన్నారని టాక్ వినిపిస్తోంది. నటుడు మురళీమోహన్ కు చెందిన ఓ విలాసవంతమైన వెంచర్ లో అత్యంత ఖరీదైన ఫ్లాట్ వుందని టాక్ వినిపిస్తోంది. ఎంతవరకు నిజమన్నది పవన్ కు, రేణుకు మాత్రమే తెలిసిన విషయం. ప్రస్తుతానికి వినిపిస్తున్న గ్యాసిప్ మాత్రం ఇది.

థ్యాంక్ గాడ్ ఆమెను పెళ్లి చేసుకోలేదు